అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోల భారీ ట్రేడ్ లైసెన్స్ ఎగవేత బయటపడింది – GHMC నోటీసులు జారీ
హైదరాబాద్ నగరంలో పేరెన్నికగన్న అన్నపూర్ణ స్టూడియోలు మరియు రామానాయుడు స్టూడియోలు భారీగా ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ఎగ్గొట్టినట్టు GHMC తనికీల్లో బయటపడింది. సంవత్సరాల తరబడి వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపిస్తూ లక్షల్లో కట్టాల్సిన ఫీజులను కేవలం పదివేలు–పన్నెండు వేల రూపాయల వరకు మాత్రమే చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. GHMC స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా స్టూడియోల వివరాలు పరిశీలించడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి అన్నపూర్ణ స్టూడియోస్ ఫీజు ఎగవేత తనిఖీల్లో బయటపడ్డ వివరాలు: అధికారులు ఈ తేడాపై తీవ్ర…

