తుని పట్టణంలో జరిగిన మైనర్ బాలికపై అత్యాచారం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో నిందితుడైన నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతుండగా, కుటుంబ సభ్యులు మాత్రం ఇది సూసైడ్ కాదు, అనుమానాస్పద మరణం అని ఆరోపిస్తున్నారు.
నారాయణరావు తుని కొండవారి పీటకు చెందినవాడు. అతడి ఇంటి పక్కనే మైనర్ బాలిక ఇల్లు ఉండేది. పాప గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. బాలిక తండ్రి లేకపోవడంతో కుటుంబం కష్టాల్లో ఉందని తెలిసిన నారాయణరావు, ఆమెపై దురుద్దేశంతో మాయ మాటలు చెప్పి పలుమార్లు స్కూల్ నుండి బయటకు తీసుకెళ్లాడని తల్లిదండ్రులు తెలిపారు.
పాపకు రక్త ఇన్ఫెక్షన్ ఉందని ఇంజెక్షన్ వేయించాలి” అని చెప్పి కనీసం మూడు సార్లు స్కూల్ నుంచి బయటకు తీసుకెళ్లాడట. గురుకుల స్కూల్‌లో తాను బాలికకు “తాత” అని చెప్పి నమ్మబలికాడు. ఇటీవల కూడా ఇదే విధంగా పాపను తీసుకెళ్లి తొండంగి సమీపంలోని పొలాల దగ్గర అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సమాచారం.
స్థానిక రైతులు అతని ప్రవర్తనను ప్రశ్నించగా, తాను “మాజీ కౌన్సిలర్” అంటూ బెదిరించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గ్రామస్తులు కోపంతో నారాయణరావును చితకబాదారు.
దీనిపై పోలీసులు POCSO మరియు కిడ్నాప్ కేసులు నమోదు చేసి నారాయణరావును అదుపులోకి తీసుకున్నారు. అతన్ని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచడానికి తీసుకెళ్తుండగా, వాష్‌రూమ్‌కు వెళ్లాలని చెప్పి చెరువుకు దూకి పారిపోవడానికి ప్రయత్నించాడు.
పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో శరీరాన్ని వెతికి బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం తుని ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.
కానీ కుటుంబ సభ్యులు ఈ ఘటనపై తీవ్ర అనుమానం వ్యక్తం చేశారు.

