ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో, యువతలో ఎక్కువగా వినిపిస్తున్న ఒక కొత్త పదం “హోబోసెక్షువాలిటీ”.
ఇది ఏమిటి? ఎందుకు ఈ మధ్య పెరుగుతోంది? అనేది చాలామందికి తెలియని అంశం.
హోబోసెక్షువాలిటీ అంటే — అద్దె లేదా ఆర్థిక అవసరాల కోసం సంబంధాలు (relationships) కొనసాగించడం. ఇది నిజమైన ప్రేమ బంధం కాకుండా జీవన వ్యయాలను మేనేజ్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక సామాజిక ధోరణిగా మారుతోంది.
ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో రొమాంటిక్ లేదా ఫిజికల్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లి, ఒకరు ఇంకొకరికి ఫుడ్, షెల్టర్, అకామిడేషన్ ఇస్తే ప్రతిగా ఫిజికల్ సపోర్ట్ అందిస్తారు. ఈ వ్యవస్థ ఎక్కువగా మెట్రో నగరాల్లో, ముఖ్యంగా అధిక అద్దె ధరలు, లైఫ్ స్టైల్ ఖర్చులు పెరిగిన కారణంగా ప్రాచుర్యం పొందుతోంది
నిపుణులు చెబుతున్నది ఏమిటంటే — ఇది తాత్కాలిక ఆర్థిక అవసరాలను తీర్చగలిగినా, దీని వల్ల మానసిక ఒత్తిడి, ఒంటరితనం, భావోద్వేగ అస్థిరత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ కూడా ఈ ధోరణికి దోహదం చేస్తున్నాయని అంటున్నారు.
ఇదే విషయంపై నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ సంస్కృతి భారతీయ సాంప్రదాయాల నుంచి దూరమవుతున్నదని విమర్శిస్తుంటే, మరికొందరు ఇది ఆధునిక జీవన శైలిలో భాగమని వాదిస్తున్నారు.
పాత కాలంలో ప్రేమ, వివాహం వంటి అంశాలు క్రమశిక్షణతో ఉండేవి. కానీ ఇప్పుడు స్కూల్ లవ్ నుండి ఆఫీస్ లవ్ వరకు ప్రతి దశలో బ్రేకప్స్ సాధారణమైపోయాయని, అందుకే సంబంధాల విలువ తగ్గిపోయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
మరి మీరు ఏమనుకుంటున్నారు?
ఈ “హోబోసెక్షువాలిటీ” ట్రెండ్ ప్రేమకు ముసుగు కట్టిన అవసరమా? లేక సమాజంలో కొత్త రకమైన సంబంధమా?
మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో తెలియజేయండి.

