కరీబియన్ సముద్రతీర దేశాలను మెలిసా హరికేన్ వణికిస్తోంది. ముఖ్యంగా జమైకాలో ఈ తుఫాన్ భారీ విధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఈ సంవత్సరం అత్యంత శక్తివంతమైన హరికేన్‌గానే కాకుండా, గత 174 ఏళ్లలో ప్రపంచం చూడని తీవ్రతతో ఇది దూసుకెళ్తోందని వాతావరణ నిపుణులు వెల్లడించారు.
తుఫాన్ ప్రభావంతో తీవ్ర గాలులు, భారీ వర్షాలు, సముద్ర అలలు విరుచుకుపడుతున్నాయి. రహదారులు, ఇళ్లు, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ప్రజలు భయాందోళనలతో సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు.
ఈ నేపథ్యంలో అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు చెందిన హరికేన్ హంటర్స్ ప్రత్యేక మిషన్ చేపట్టారు. తుఫాన్ కేంద్రభాగంలోకి విమానాన్ని నడిపి, అమెరికా నేషనల్ హరికేన్ సెంటర్ కోసం కీలక వాతావరణ డేటాను సేకరించారు.
ఈ సాహసోపేత మిషన్‌లో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దట్టమైన బూడిద మేఘాలు, ఐవాల్ వలయం, మరియు తుఫాన్ కేంద్రంలో కనిపించిన అద్భుత దృశ్యాలు నెటిజన్లను ఆశ్చర్యపరిచాయి
భూమిపై భయం… కానీ తుఫాన్ మధ్యలో ప్రకృతి అద్భుతం!” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
నిపుణులు మెలిసా తుఫాన్ ఇంకా కొన్ని రోజులు ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వాలు, రక్షణ సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయి.
మరిన్ని అప్‌డేట్స్ కోసం మా చానల్‌ను వీక్షించండి.

