జీతం ట్రిలియ‌న్ డాల‌ర్లు.. ఆనందం పట్టలేక రోబోతో కలిసి డ్యాన్స్‌ చేసిన మస్క్‌..


ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్‌ ఎలాన్‌ మ‌స్క్, సంచ‌ల‌నం సృష్టించారు. కార్పొరేట్ చ‌రిత్రలోనే అత్యధిక జీతం అందుకుంటున్న, సీఈవోగా ఆయన రికార్డు క్రియేట్ చేశారు. జీతం కింద మ‌స్క్‌కు ట్రిలియ‌న్ డాల‌ర్లు, ఇచ్చేందుకు టెస్లా కంపెనీ షేర్‌హోల్డర్లు, ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జరిగిన టెస్లా వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మస్క్‌ ఆనందానికి అవధులు లేవు. ఈ గుడ్‌న్యూస్‌ను తన సంస్థకు చెందిన హ్యూమనాయిడ్‌ రోబోస్‌తో సెలబ్రేట్‌ చేసుకున్నారు. రోబోలతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తూ మస్క్‌ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.
కంపెనీకి చెందిన షేర్‌హోల్డ‌ర్ల‌లో 75 శాతం ఓట్లు ఆయ‌న‌కు అనుకూలంగా వ‌చ్చాయి. ఇప్ప‌టికే ప్ర‌పంచ కుబేరుడైన మ‌స్క్‌.. ఇప్పుడు త‌న సంప‌ద‌ను మ‌రింత పెంచుకోనున్నారు. అయితే రాబోయే ప‌దేళ్ల‌లో ఎల‌క్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా మార్కెట్ వాల్యూ ఆయ‌న మ‌రింత పెంచాల్సి ఉంటుంది. ఒవ‌కేళ షేర్‌హోల్డ‌ర్లు అనుకున్న‌ట్లు మ‌స్క్ త‌న ల‌క్ష్యాల‌ను సాధిస్తే, అప్పుడు ఆయ‌న‌కు ల‌క్ష‌ల సంఖ్య‌లో షేర్లు క‌లిసిరానున్నాయి. మ‌స్క్‌కు ట్రిలియ‌న్ డాల‌ర్ల పే ప్యాకేజీ అందాలంటే ఆయ‌న ముందు కొన్ని టార్గెట్ల‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం టెస్లా మార్కెట్ విలువ 1.4 ట్రిలియ‌న్ల డాల‌ర్లుగా ఉన్న‌ది. అయితే ఆ మార్కెట్ విలువ‌ను ఆయ‌న 8.5 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కు చేర్చాల్సి ఉంటుంది. స్వీయ డ్రైవింగ్ చేస్తున్న ల‌క్ష‌ల సంఖ్య‌లో రోబోట్యాక్సీ వాహ‌నాల‌ను ఆయ‌న క‌మ‌ర్షియ‌ల్ ఆప‌రేష‌న్‌లోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఒక‌వేళ అన్నీ అనుకుట్లే సాగితే, ప్ర‌పంచ కుబేరుడు మ‌స్క్ ప్ర‌పంచంలోనే తొట్ట‌తొలి ట్రిలియ‌నీర్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *