ఈ 5 ఆలయాలు చాలా డేంజర్.. పొరపాటున ఇంటికి ప్రసాదం తీసుకొచ్చారా.. ఇక మీ సంగతి అంతే!

                                           దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అయితే ఏ ఆలయానికి వెళ్లిన తప్పకుడా ప్రసాదాలు లేదా ఇంకా ఏవైనా వస్తువులు ఇంటికి తీసుకొస్తారు. కానీ దేశంలో ఉన్న కొన్ని ఆలయాల్లో ప్రసాదం తినడం, ఇంటికి తీసుకురావడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పొరపాటున ఇంటికి తీసుకెళ్తే.. దెయ్యాలు, ఆత్మలు వంటివి ఎదురు అవుతాయని పండితులు అంటున్నారు. అయితే మరి ఆ దేవాలయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

మెహందీపూర్ బాలాజీ

రాజస్థాన్‌లో ఉన్న ఈ ఆలయం హనుమంతుడికి అంకితం చేశారు. అయితే ఈ ఆలయంలో ఉండే మెహందీపూర్ బాలాజీ గురించి అందరూ వినే ఉంటారు. చెడు, ప్రతికూల శక్తులతో బాధపడేవారు ఈ ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఉపశమనం పొందుతారని నమ్ముతారు. బాలాజీ ప్రభువు శాంతి, ప్రశాంతతకు మూలమని నమ్ముతారు. బుండిభైరవ్ బాబాకు లడ్డులు, ఉరద్ పప్పు, చావ్ నైవేద్యం పెట్టడం వల్ల దుష్టశక్తులు దూరం అవుతాయని చెబుతుంటారు. అయితే ఈ ఆలయం నుండి ప్రసాదం స్వీకరించడం అశుభంగా భావిస్తారని పండితులు అంటున్నారు. 

కామాఖ్య దేవి ఆలయం

అస్సాంలోని గువహతిలోని కామాఖ్య దేవి ఆలయం శక్తి పీఠాలలో అత్యంత శక్తివంతమైనదిగా ఉంది. ఋతు చక్రంలో దేవతను ఇక్కడ పూజిస్తారు. మూడు రోజుల పండుగ సమయంలో భక్తులను ఆలయంలోకి అనుమతించరు. కాబట్టి ఎటువంటి నైవేద్యాలు తీసుకోకూడదు. ఈ రోజుల్లో దేవతకు విశ్రాంతి ఇస్తారని నమ్ముతారు. ఈ సమయంలో కాకుండా తర్వాత నైవేద్యాలు తీసుకెళ్లాలని పండితులు అంటున్నారు. 

కాల భైరవ దేవాలయం

మధ్యప్రదేశ్‌లో ఉజ్జయినిలోని కాల భైరవ ఆలయంలో భక్తులు ప్రసాదంగా మద్యాన్ని సమర్పిస్తారు. భారతదేశంలో ఈ సంప్రదాయం ఉన్న ఏకైక ఆలయం కూడా ఇదే. అయితే ఈ ప్రసాదం భైరవుడికి మాత్రమే ఇస్తారు. ఈ ప్రసాదాన్ని ఎవరైతే తింటారో వారి జీవితంలో సమస్యలు వస్తాయని చెబుతున్నారు. 

నైనా దేవి ఆలయం

హిమాచల్ ప్రదేశ్‌లోని నైనా దేవి ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ సమర్పించే నైవేద్యాలను భక్తులకు కాకుండా ప్రత్యేక ఆచారం తర్వాత మాత్రమే దేవతకు అంకితం చేస్తారు. నైనా దేవి నైవేద్యాలను ఆలయం లోపల మాత్రమే అనుమతిస్తారని చెబుతారు. ఈ నైవేద్యాలను ఇంటికి తీసుకెళ్లడం అశుభంగా పరిగణిస్తారు. అయితే ఆలయంలో నైవేద్యాలు తినడం మంచిదే.. కానీ వాటిని ఆలయం బయటకు, ఇంటికి తీసుకెళ్లడం మంచిది కాదని అంటున్నారు. 

కోటిలింగేశ్వర ఆలయం

కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో కోటి శివలింగాలు ఉన్నాయి. పూజ తర్వాత సమర్పించే నైవేద్యాలను ప్రతీకాత్మకంగా మాత్రమే అంగీకరిస్తారు. అంటే ఆ ప్రసాదాన్ని వీరు తీసుకోవచ్చు. కానీ వీటిని తినడం అశుభమని అంటున్నారు. శివలింగంపై పడిన ప్రసాదాన్ని ఎప్పుడూ తినకూడదు. ఎందుకంటే ఇది చండేశ్వరుడికి అంకితం చేశారని చెబుతున్నారు. అయితే శివలింగం దగ్గర ఉంచిన నైవేద్యాన్ని తినవచ్చని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *