జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఓటింగ్ ప్రశాంతంగా సాగుతుందని భావించిన వేళ, ఒక దొంగ ఓటు ఘటన కలకలం రేపింది. పోలింగ్ బూత్ నంబర్ 67లో జరిగిన ఈ ఘటన ఎన్నికల వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఒక మహిళా ఓటర్ తన ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి రాగా, ఇప్పటికే ఆమె పేరుతో ఓటు వేసినట్లు అధికారులు తెలియజేశారు. దీనిపై ఆ మహిళా ఓటర్ ఆవేదన వ్యక్తం చేస్తూ, “నా ఓటు వేరే వ్యక్తి వేసేశాడు, ఇది ఎలా సాధ్యం?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆమె భర్త మాట్లాడుతూ, “పోలింగ్ అధికారులు ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. ఓటు వేసిన రికార్డు ఉందని మాత్రమే చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తున్నాయి” అని మండిపడ్డారు.
ఈ ఘటనపై ఎన్నికల అధికారులు విచారణ ప్రారంభించారు. దొంగ ఓటు ఘటనపై సీసీటీవీ ఫుటేజ్ సేకరిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఓటర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది.

