23 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న ప్రభాస్, ఈశ్వర్ నుండి బాహుబలి, సలార్, కల్కి 2898 AD వరకు పాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా ఎదిగారు. ఆయన వినయం, కృషి, అంకితభావం ఆయనను దేశవ్యాప్తంగా అభిమానుల మనసుల్లో నిలిపాయి. టాలీవుడ్లో తన తొలి అడుగును ‘ఈశ్వర్’ సినిమాతో వేసిన ప్రభాస్‌కి తన సినీ ప్రయాణం నేటితో 23 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ 23 ఏళ్లలో ఆయన కేవలం తెలుగు స్టార్‌గా మాత్రమే కాకుండా, భారతదేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహించే పాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా ఎదిగారు. ఒకప్పుడు సైలెంట్ హీరోగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు దేశం మొత్తంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా నిలిచారు.
Year Title Role Notes
2002 Eeswar Eeswar Debut Film
2003 Raghavendra Raghava
2004 Varsham Venkat
2004 Adavi Ramudu Ramudu
2005 Chakram Chakram
2005 Chatrapathi Sivaji / Chatrapathi
2006 Pournami Sivakeshava Naidu
2007 Yogi Eeswar Prasad / Yogi
2007 Munna Mahesh Kumar “Munna”
2008 Bujjigadu Bujji
2009 Billa Billa and Ranga Dual Role
2009 Ek Niranjan Chotu
2010 Darling Prabhas “Prabha”
2011 Mr. Perfect Vicky
2012 Rebel Rishi / Rebel
2012 Denikaina Ready Himself Voice-over
2013 Mirchi Jai
2014 Action Jackson Himself Hindi Film; Cameo in “Punjabi Mast”
2015 Baahubali: The Beginning Amarendra & Mahendra Baahubali Bilingual
2017 Baahubali 2: The Conclusion Amarendra & Mahendra Baahubali
2019 Saaho Siddhanth Saaho / Ashok Chakravarthy
2022 Radhe Shyam Vikramaditya
2023 Adipurush Raghava
2023 Salaar: Part 1 – Ceasefire Devaratha “Deva” Raisaar / Salaar
2024 Kalki 2898 AD Bhairava and Karna Dual Role
2025 Kannappa Rudra Cameo Appearance
2025 Mirai Narrator Voice-over
2025 Baahubali: The Epic Amarendra & Mahendra Baahubali Combined Re-release of Baahubali 1 & 2
2026 The RajaSaab TBA Post-production
TBA Fauji TBA Filming
TBA Spirit TBA Pre-production
ఈశ్వర్ నుండి వర్షం వరకు
ప్రభాస్ మొదట్లో సినిమాల్లోకి రావాలన్న ఆలోచన లేకపోయినా, ఆయన పెదనాన్న కృష్ణంరాజు ప్రోత్సాహంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమా ఈశ్వర్ (2002) ఆయనకు పెద్దగా విజయం ఇవ్వకపోయినా, తర్వాత సినిమాలు ఆయనలో ఉన్న సామర్థ్యాన్ని చూపించాయి. 2004లో వచ్చిన వర్షం సినిమాలో వెంకట్ పాత్రతో ప్రభాస్‌కి యూత్ లో భారీ గుర్తింపు వచ్చింది. ఆ సినిమా విజయంతో ఆయన కెరీర్ దిశ మారిపోయింది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి (2005) ప్రభాస్‌కి బలమైన హీరో ఇమేజ్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయన పేరు ప్రేక్షకుల మనసుల్లో బలంగా నాటుకుపోయింది. తరువాత వచ్చిన బిల్లా, మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్, మిర్చి వంటి సినిమాలతో ఆయన అభిమానులను మరింత పెంచుకున్నారు. ప్రతి సినిమాలో లుక్స్, నటన, డైలాగ్ డెలివరీ కొత్తగా అనిపించేవి. ప్రభాస్ కెరీర్లో అత్యంత ముఖ్యమైన మలుపు బాహుబలి. దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమా కోసం ప్రభాస్ నాలుగేళ్లు కష్టపడ్డారు. ఇతర సినిమాలను పక్కన పెట్టి పూర్తిగా ఈ ప్రాజెక్ట్‌కి అంకితమయ్యారు. పాత్రకు తగిన శరీరాకృతి కోసం కఠినమైన వర్కౌట్లు చేశారు. బాహుబలి: ది బిగినింగ్ (2015), బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017) సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టాయి. ముఖ్యంగా బాహుబలి 2 ₹1000 కోట్ల మార్క్‌ను దాటి, ప్రభాస్‌ను భారతదేశపు తొలి పాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా నిలిపింది. ఆ సినిమా తర్వాత ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఆయనకు 5000కు పైగా మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయని వార్తలు కూడా వచ్చాయి. బాహుబలి విజయం తర్వాత 2017లో బ్యాంకాక్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మోముతో చేసిన విగ్రహం ఏర్పాటు చేసారు. దక్షిణ భారత నటుల్లో ఈ గౌరవం పొందిన మొదటి నటుడు ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ భారీ స్థాయిలో విడుదలయ్యాయి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్: పార్ట్ 1 – సీజ్ఫైర్, కల్కి 2898 AD వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ప్రతి సినిమాను ఒక పండగల పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకున్నారు ఫ్యాన్స్. కల్కి 2898 AD విడుదలతో ప్రభాస్ మరోసారి తన మార్క్‌ను చూపించారు. ఆయన ఒక్కరే ఐదు ₹100 కోట్ల ఓపెనింగ్స్ సాధించిన భారత నటుడిగా రికార్డు సృష్టించారు. ప్రభాస్ ఎంత పెద్ద స్టార్ అయినా, ఆయన వ్యక్తిత్వం మాత్రం చాలా సాదా సీదా. షూటింగ్ లేని రోజుల్లో ఎక్కువగా ఇంట్లోనే గడుపుతారు. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండరు. ఆయనను తెలిసినవాళ్లు “సైలెంట్ స్టార్” అని పిలుస్తారు. కానీ ఆయన సహాయస్వభావం, వినయం అందరికీ తెలిసిన విషయమే. పబ్లిసిటీ లేకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. ప్రభాస్ ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు. ఆయన రెమ్యునరేషన్ ఒక్క సినిమాకి రూ.80 కోట్ల నుండి రూ.150 కోట్ల వరకు ఉంటుంది. నెట్ వర్త్ సుమారు రూ.241 కోట్లు. ఆయనకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం రేంజ్ రోవర్, రోల్స్ రాయిస్ ఫాంటమ్, లాంబోర్గినీ అవెంటడార్, జాగ్వార్ XJR, BMW X3 లాంటి కార్లు ఆయన గ్యారేజీలో ఉన్నాయి.
హాబీలు, ఇష్టాలు
ప్రభాస్‌కి వాలీబాల్ ఆడటం, పుస్తకాలు చదవడం చాలా ఇష్టం.
ఇష్టమైన ఆహారం – హైదరాబాద్ బిర్యానీ
ఇష్టమైన నటులు – రాబర్ట్ డి నీరో, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే
ఇష్టమైన దర్శకుడు – రాజ్‌కుమార్ హిరానీ
ఇష్టమైన పాట – వర్షం సినిమాలో “మెల్లగా కరగని”
ఇష్టమైన పుస్తకం – ది ఫౌంటెన్హెడ్ (Ayn Rand రచన)
ఇష్టమైన ట్రావెల్ ప్లేస్ – లండన్
ప్రభాస్ రాబోయే సినిమాలు
ప్రభాస్ ప్రస్తుతం అనేక భారీ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నారు:
ది రాజా సాబ్ (The Raja Saab) – మారుతి దర్శకత్వంలో రొమాంటిక్ హారర్ కామెడీగా తెరకెక్కుతోంది. 2026 సంక్రాంతికి విడుదల కానుంది. దర్శకుడు మారుతి ప్రభాస్ 23 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, తాజాగా ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు.
సలార్: పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం – మొదటి భాగం తర్వాత ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్‌ల కలయికలో వస్తున్న సీక్వెల్.
కల్కి 2898 AD పార్ట్ 2 – నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫ్యూచరిస్టిక్ చిత్రం డిసెంబర్ 2025లో షూటింగ్ ప్రారంభం కానుంది.
స్పిరిట్ – సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్.
ఫౌజీ (Fauji) – హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా.
23 ఏళ్ల సినీ ప్రయాణంలో ప్రభాస్ కేవలం స్టార్‌గా కాకుండా, ఫ్యాన్స్ కు ఒక ఎమోషన్ గా మారిపోయారు. వినయం, కృషి, అంకితభావం వల్ల ఆయన ఇప్పటికీ అభిమాన హృదయాల్లో రాజుగా ఉన్నారు. ప్రభాస్ కేవలం ఒక హీరో మాత్రమే కాదు, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఆయన 23 ఏళ్ల సినీ ప్రయాణం మునుముందు మరెన్నో విజయాలతో సాగాలని కోరుకుందాం.

