బాల్నగర్ ప్రాంతంలో జరుగుతున్న భూముల వివాదం రాజకీయ రంగంలో తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. స్థానిక దళిత కుటుంబాలు, పేద మరియు మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.
“ఒక నోటీసు కూడా ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డుపాలుచేశారు” అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాళ్ల మాటల్లో—
“మేము ఆక్రమణ దారులం కాదు. మా తాతలు 60 ఏళ్ల క్రితమే కొన్న భూముల్లోనే ఉన్నాం. కరెంట్ బిల్లు ఉంది, వాటర్ బిల్లు ఉంది, ట్యాక్సులు కడుతున్నాం. ఇల్లు నెంబర్ ఉంది, ప్రభుత్వమే సీసీ రోడ్లు వేసింది. మరి ఇప్పుడు అక్రమం ఎలా?”
బాధితుల ఆరోపణల ప్రకారం, స్టే ఆర్డర్లు కోర్టుల నుంచి తెచ్చుకున్నప్పటికీ, అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.
దళితులను జోలికి రావద్దని చెప్పేవారే ఇలా చేస్తున్నారు”
బాధితులు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.
“టీవీల్లో దళితులకి నేను తోడుంటానని మాట్లాడేవాడు… నేలమీద మమ్మల్ని రోడ్డుపాలుచేస్తున్నాడు. ఇదేనా అభివృద్ధి?”
మోత్కపల్లి నరసింహ, పూర్వ దళిత నేత పేరును ప్రస్తావిస్తూ—
“ఒకడు చచ్చిపోతే కోటి రూపాయలు ప్రకటిస్తారు. కానీ బ్రతికి పోరాడుతున్న దళితుల కోసం ఒక్క మాట కూడా మాట్లాడరు” అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
ఎఫ్‌టిఎల్ స్టోన్ దాచేశారు… ఇప్పుడు లోపలికి వచ్చినట్లు చూపిస్తున్నారు!”
ప్రాంత ప్రజలు మరో కీలక ఆరోపణ చెబుతున్నారు—
“ఎఫ్టీఎల్ (Full Tank Level) స్టోన్ ముందే ఫిక్స్ అయింది. కానీ అది మట్టి పోసి, పార్క్ కట్టేశారు. ఇప్పుడు మమ్మల్ని అక్రమంగా లోపలికి వచ్చారని చూపిస్తున్నారు.”
ప్రభుత్వం అథికారులు అయితే ఇప్పటి వరకు ఈ ఆరోపణలపై స్పందించలేదు.
💥 ప్రజల ప్రశ్న:
“మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర ఉన్న ఎఫ్‌టిఎల్ ఎందుకు తీసేయరు? మమ్మల్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?”
📌 చివరి మాట
ఈ వివాదం కేవలం భూముల విషయంలో కాదు—
అది సమానత్వం, హక్కులు మరియు ప్రభుత్వ నైతికత మీదే ప్రశ్న.బాధితులు ఒక్క మాటతో ముగించారు:
“మాకు లీగల్ ప్రూఫ్స్ ఉన్నాయి. మమ్మల్ని విని న్యాయం చేయాలి… లేకపోతే ఈ పోరాటం ఆగదు.”

