తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ అంటూ భారీగా ప్రకటనలు, పోస్టర్లు, ఈవెంట్లు… కానీ అసలైన ప్రశ్న మాత్రం ఒక్కటే — “తెలంగాణ ప్రజలకు లాభం ఏమిటి?”
ఇప్పటి వరకు రెండు సంవత్సరాలుగా దావోస్‌కు వెళ్లి, కోట్లాది రూపాయల పన్ను డబ్బుతో బృందాలు తిరిగాయి. “84 వేల కోట్లు డీల్స్ వచ్చాయి” అని చెప్పిన ప్రభుత్వం — ఆ డబ్బు ఎక్కడ? కంపెనీలు ఎక్కడ? ఉద్యోగాలు ఎక్కడ?
ఐటీ శాఖ మంత్రులు బూట్లు వేసుకుని విదేశాలకు వెళ్లి ఫోటోలు దిగడం తప్ప, తెలంగాణకు వచ్చిన రియల్ బెనిఫిట్ ఏంటి? ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలకు ప్రైవేట్ జాబ్స్ ఎన్ని వచ్చాయి? రికార్డ్ చూపించగలరా?
గ్లోబల్ సమ్మిట్ రాబోతుందట. కానీ ప్రజలు అడగాల్సిన ప్రశ్నలు మూడు:
- ఈ సమ్మిట్ వల్ల తెలంగాణకు అసలు ఏం దక్కబోతుంది?
- వచ్చే కంపెనీల పేర్లు, పెట్టుబడులు, టైమ్‌లైన్ ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు?
- పబ్లిక్ మనీతో ఈవెంట్… కానీ బెనిఫిట్ మాత్రం ఎవరికీ? ప్రజలా? లేక నాయకుల వ్యాపార మిత్రులకా?
ఇంక👉 ఒక హైగ్రేడ్ కామెడీ:
తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లు హ్యాక్ అయినా — “మాకు తెలియదు”
అయితే గ్లోబల్ ఇన్వెస్టర్లకు “సేఫ్ Telangana” అని ఎలా నమ్మిస్తున్నారు?
ఇది అభివృద్ధి పేరుతో భూములు కట్టిపెట్టే కొత్త ఆటనా?
లేక తెలంగాణను మరో స్కామ్ ఫీల్డుగా మార్చే పథకమా?
ప్రజలకు హక్కుంది —
📢 “గ్లోబల్ సమ్మిట్ వల్ల మాకు ఏం లాభం?”
అని అడగడానికి.
పార్టీలు మారుతాయి కానీ ప్రజల డబ్బు మాత్రం వృధా కాకూడదు.
కాబట్టి —
❓ వాస్తవ అభివృద్ధా?
లేక
❓ రాజకీయ షో ఆఫ్ & రియల్ ఎస్టేట్ గేమా?
ప్రజలే నిర్ణయించాలి.

