సర్పంచ్ ఎన్నికలు అభివృద్ధి కాదు… వేలంపాటల వ్యవస్థగా మారాయి: ప్రజాస్వామ్యం ప్రమాదంలో”
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ అభివృద్ధి పేరుతో భారీ ప్రాజెక్టులు, వేల కోట్ల పెట్టుబడులు, ఇనాగరేషన్లు ప్రకటిస్తున్నప్పటికీ… మరోవైపు ఉప ఎన్నికల ప్రచారంలోనూ, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల ప్రచారంలోనూ నేరుగా పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడుల హామీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, నిరుద్యోగ భృతి, పెన్షన్లు, షాదీ ముబారక్, స్కూటీ పథకాలు, బంగారం పథకాలు…

