Latest
ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్‌కు చేరిందా? కేసీఆర్–హరీష్ రావులకు సిట్ నోటీసులు దాదాపు ఖాయం!
ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరిందా? కేసీఆర్–హరీష్ రావులకు సిట్ నోటీసులు దాదాపు ఖాయం తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దర్యాప్తు ఇప్పుడు తుది అంకానికి చేరిందన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు పేర్లు వాంగ్మూలాల్లో రావడంతో వారిని విచారణకు పిలిచే అంశం దాదాపు ఖరారైనట్టేనని…
కొట్టలగూడ–లాసింగ్ తాండా గ్రామాల అభివృద్ధికి పూర్తి బాధ్యత నాది: వికారాబాద్ ఎమ్మెల్యే స్పష్టం
కొత్తగా ఎన్నికైన మహిళా సర్పంచులు, వార్డు సభ్యులకు అభినందనలు తెలుపుతూ వికారాబాద్ నియోజకవర్గంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లాసింగ్ తాండా, కొట్టలగూడ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సభను ఉద్దేశించి మాట్లాడిన వికారాబాద్ ఎమ్మెల్యే, కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులందరికీ చప్పట్లతో అభినందనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. కొట్టలగూడ, లాసింగ్ తాండా గ్రామాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అందించే పూర్తి బాధ్యత తనదేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో…
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆగ్రహం.. 10 వేల కోట్లు వెంటనే చెల్లించాలి: ఎస్. దుర్గయ్యగౌడ్
బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ ఎస్. దుర్గయ్యగౌడ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద సుమారు రూ.10 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. నిన్న ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.365.75 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారని, అయితే…
కేసీఆర్ ప్రెస్ మీట్‌పై కాంగ్రెస్ ఫైర్.. 10 ఏళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి చూపించండి: చెన్నగాని దయాకర్
ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సంవత్సరాల విరామం తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఓకే టీవీకి ఇచ్చిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో టీపీసీసీ అధికార ప్రతినిధి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెన్నగాని దయాకర్ కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పూర్తిగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమైందని, కానీ తన పదేళ్ల పాలనలో తెలంగాణకు చేసిన ఒక్క…
న్యూ ఇయర్ వేడుకలపై ఎక్సైజ్ కఠిన ఆంక్షలు.. డ్రగ్స్ వాడితే పీడీ కేసులు, ఈవెంట్ పర్మిషన్ తప్పనిసరి
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. వేడుకల ముసుగులో డ్రగ్స్, గంజాయి, సింథటిక్ డ్రగ్స్ వాడితే పీడీ యాక్ట్ కింద కేసులు తప్పవని అధికారుల గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈవెంట్ పర్మిషన్ లేకుండా వేడుకలు నిర్వహిస్తే నేరుగా జైలుకే పంపిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 27 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్…
ఫోన్ ట్యాపింగ్ కేసుపై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు.. నోటీసులకు భయపడేది లేదంటూ సవాల్
ఫోన్ ట్యాపింగ్ కేసుపై రాజకీయ దుమారం మరింత ఉధృతమవుతోంది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో స్పందించారు. మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ, “ఇలాంటి తాటాకు చప్పుళ్లకు మేము భయపడేది లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇస్తామంటూ లీకులు ఇచ్చి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నోటీసులు, కేసులు మాకు లెక్కే కాదు. రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వాన్ని నిలదీస్తాం” అని స్పష్టం చేశారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి…
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులపై ఉత్కంఠ
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (Special Investigation Team) దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ రావు ప్రభాకర్ రావును తాజాగా సిట్ అధికారులు విచారించారు. అయితే ఆయన విచారణకు పూర్తిగా సహకరించడం లేదని పేర్కొంటూ, మరింత కస్టడీ అవసరమని కోర్టును ఆశ్రయిస్తూ మరోసారి రిమాండ్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాకర్ రావు కస్టడీ గడువు మరో 48 గంటల్లో ముగియనున్న నేపథ్యంలో, ఇప్పటికే అరెస్టయిన…
రెండేళ్ల విజయోత్సవాల వెనుక బెదిరింపుల రాజకీయం? సహకార ఎన్నికలకు భయపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే ముఖ్యమంత్రి రెండేళ్ల విజయోత్సవాల పేరిట జిల్లా జిల్లా తిరుగుతూ రాజకీయ ప్రచారం చేస్తున్నారని, అదే సమయంలో స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలను బెదిరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. “ఇందిరమ్మ ఇళ్లు రావు… ఈ పథకం రాదు… ఆ పథకం రాదు” అంటూ అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని గ్రామ గ్రామాల్లో భయభ్రాంతులు సృష్టించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి ఒత్తిడి, బెదిరింపులు ఉన్నా కూడా నిజాయితీగా ఎన్నికలు జరిగి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం…
పిఓబి నిషేధిత జాబితా ఎవరి బాధ్యత? రెవెన్యూ అధికారుల గందరగోళం, ప్రభుత్వ తీరు పై ప్రజల్లో ఆందోళన
రాష్ట్రంలో పిఓబి (నిషేధిత) భూముల జాబితా రూపకల్పనపై తీవ్ర గందరగోళం నెలకొంది. అసలు ఈ జాబితా తయారు చేయాల్సిన బాధ్యత ఎవరిది? భూములను గుర్తించాల్సింది ఎవరు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టత లేదు. రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పట్టాదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూములను గుర్తించి పిఓబి నిషేధిత జాబితా రూపొందించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖదే. కానీ తహసీల్దారులు మాత్రం సబ్ రిజిస్ట్రార్లకు లేఖలు రాస్తూ వివరాలు అడగడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు ఇవ్వాల్సిన…
రెండేళ్ల పాలనపై ప్రజల ప్రశ్నలు: సహకార ఎన్నికలకు ఎందుకు భయం? కేసుల లీక్‌లతో కాలక్షేపం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవాలు ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగించలేకపోయాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కాలికి బల్బం కట్టుకొని జిల్లాల వారీగా తిరిగినా, స్థానికంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలను బెదిరించే ధోరణి కనిపించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 🏠 పథకాలు రాకపోతాయని బెదిరింపుల ఆరోపణలు ఇందిరమ్మ ఇండ్లు రావు, ఫలానా పథకం ఇవ్వం అంటూ అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను బెదిరించారని విమర్శలు…

