అనసూయ ‘కిల్లర్’ లుక్స్.. గ్లామర్ వైబ్స్ వేరే లెవెల్!

బుల్లితెరపై గ్లామరస్ యాంకర్‌గా భారీ క్రేజ్ సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై స్టార్ హీరోయిన్‌గా తనదైన ముద్ర వేస్తోంది. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టినా, నటిగా ఆమె సాధించిన గ్రోత్ మాత్రం నిజంగా ఇన్‌స్పైరింగ్. గ్లామర్ రోల్స్ అయినా, పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ అయినా… అనసూయ చేస్తే ‘తగ్గేదే లే’ అన్నట్లే ఉంటుంది.

సినిమాలతో బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం అనసూయ హంగామా మామూలుగా ఉండదు. తాజాగా ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తున్నాయి. బ్లాక్ అనార్కలీ డ్రెస్‌లో అనసూయ క్లాసీగా, అంతకు మించి బ్యూటిఫుల్‌గా మెరిసిపోతోంది. ఆ డ్రెస్‌పై ఉన్న రంగురంగుల ప్రింట్స్ ఆమె లుక్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.

ఫుల్ హ్యాండ్స్, ఫ్లోర్ లెంగ్త్ ఉన్న ఈ అవుట్‌ఫిట్‌లో అనసూయ అచ్చం బాపు బొమ్మలా, ట్రెడిషనల్ వైబ్స్ ఇస్తోంది. స్టైలింగ్ విషయంలో ఎప్పుడూ ట్రెండ్ సెట్టర్‌గా ఉండే అనసూయ, ఈసారి హెవీ మేకప్‌కు దూరంగా ఉండి చాలా న్యాచురల్‌గా, సింపుల్‌గా రెడీ అయ్యింది. పెద్ద సైజ్ వెండి జుంకాలు, చేతి వేళ్లకు రింగులు, లూజ్ హెయిర్ స్టైల్‌తో క్యూట్ స్మైల్ ఇస్తున్న ఫోజులు ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాయి.

సింపుల్ హీల్స్, లైట్ లిప్‌స్టిక్‌తో తన లుక్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసింది అనసూయ. కెరీర్ విషయానికి వస్తే… ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా, ‘పుష్ప’లో దాక్షాయణిగా ఆమె చేసిన పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. ఒకవైపు గ్లామర్ డోస్ పెంచుతూనే, మరోవైపు సీరియస్ రోల్స్‌లోనూ తన నటనతో మెప్పిస్తోంది.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ, వెస్ట్రన్ వేర్ నుంచి ట్రెడిషనల్ వేర్ వరకూ వరుస ఫోటోషూట్స్‌తో ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్ ఇస్తూనే ఉంది. వయసు పెరుగుతున్నా, ఆమె గ్లామర్‌, ఎనర్జీ మాత్రం అస్సలు తగ్గట్లేదు. బ్లాక్ డ్రెస్‌లో ఆమె రాయల్ లుక్ చూసి నెటిజన్లు “క్రేజీ”, “స్టన్నింగ్”, “బ్యూటిఫుల్” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *