తన కుమార్తె వామికా ఐదో పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ నటి అనుష్క శర్మ మాతృత్వంపై భావోద్వేగభరితమైన పోస్ట్ చేసి అభిమానులను కదిలించారు. తల్లి అయిన తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పులను, ఆ అనుభవం ఎంత లోతైనదో హృదయానికి హత్తుకునేలా వివరించారు.
మాతృత్వం తనను పూర్తిగా మార్చేసిందని, ఈ ప్రయాణంలోని ప్రతి క్షణాన్ని తాను ఆస్వాదిస్తున్నానని అనుష్క వెల్లడించారు. ప్రపంచంలోని ఏదికోసమూ తన మాతృత్వపు అనుభవాన్ని వదులుకోలేనని ఆమె స్పష్టం చేశారు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ దంపతులకు 2021లో కుమార్తె వామికా జన్మించిన సంగతి తెలిసిందే.
కూతురి పుట్టినరోజున అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో మాతృత్వం గురించి ఉన్న ఒక లోతైన భావోద్వేగ పోస్ట్‌ను రీషేర్ చేశారు. ఆ పోస్ట్‌లో,
“మాతృత్వం మిమ్మల్ని మార్చనివ్వండి. ఈ కొత్త వెర్షన్‌కు బాధ్యత వహించండి. పాత జీవితాన్ని కొనసాగిస్తూ, పిల్లల్ని కూడా చూసుకోవచ్చనేది పాక్షికంగానే నిజం. దీనికి చెల్లించాల్సిన మూల్యం గురించి ఎవరూ చెప్పరు. అలసిన కళ్లతో, నిండు హృదయంతో మన అవసరాలు అదృశ్యం కావు, అవి పునర్వ్యవస్థీకరించబడతాయి” అని ఉంది.

ఇక మరో భాగంలో,
“తల్లి ఒక వైరుధ్యం. ప్రేమ, అలసట, ఎదుగుదల, బాధ అన్నీ పక్కపక్కనే ఉంటాయి. ఈ భావాలన్నీ మనల్ని ఎంతో అలసిపోయేలా చేస్తాయి. మనల్ని తీర్చిదిద్దే ఈ చిన్న, బరువైన, అర్థవంతమైన క్షణాల్లోనే ఇది జరుగుతుంది” అని మాతృత్వ సారాంశాన్ని అద్భుతంగా వివరించారు.
ఈ పోస్ట్‌ను షేర్ చేస్తూ అనుష్క తన మనసులోని భావాలను మరింత వ్యక్తిగతంగా వెల్లడించారు.
“నా బిడ్డా.. నువ్వు పరిచయం లేని నా పాత వెర్షన్‌కు నేను ఎప్పటికీ వెనుదిరిగి వెళ్లాలనుకోను. జనవరి 11, 2021” అని రాసి, హార్ట్ ఎమోజీని జోడించారు. ఈ మాటలు ఆమె మాతృత్వాన్ని ఎంతగా ప్రేమిస్తున్నారో స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ 2017 డిసెంబర్‌లో ఇటలీలో వివాహం చేసుకున్నారు. వీరికి 2021లో కుమార్తె వామికా, 2024 ఫిబ్రవరిలో కుమారుడు అకాయ్ జన్మించారు.
సినిమాల విషయానికి వస్తే, అనుష్క శర్మ చివరిసారిగా 2018లో విడుదలైన ‘జీరో’ చిత్రంలో నటించారు. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఆ తర్వాత అనుష్క నటనకు విరామం ఇచ్చి కుటుంబానికే పూర్తి సమయం కేటాయిస్తూ, మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు.
4