ఫ్లాప్ మూవీ సాంగ్‌ కి చాలా డిమాండ్ 

                                          రోజురోజుకీ సోష‌ల్ మీడియా వాడ‌కం విప‌రీతంగా పెరుగుతుంది. దీంతో ఏ విష‌యం ఎప్పుడు, ఎందుకు, ఎలా వైర‌ల్ అవుతుందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఎప్పుడో మ‌రుగున ప‌డిపోయిన విష‌యాలు స‌డెన్ గా వైర‌ల్ అవుతుండ‌టం, అంద‌రూ మ‌రిచిపోయిన పాట‌లు మ‌ళ్లీ ట్రెండింగ్ లోకి రావ‌డం.. ఇవన్నీ సోష‌ల్ మీడియా వాడ‌కం ఎక్కువ అవ‌డం వ‌ల్లే జ‌రుగుతున్నాయి. ఈ సోష‌ల్ మీడియా కార‌ణంగా ఇప్పుడు ఓ ఫ్లాప్ సినిమాలోని పాట ప్ర‌స్తుతం ట్రెండింగ్ గా మారింది. టాలీవుడ్ సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ న‌టించిన ఆయుధం సినిమా ఫ్లాప్ అనే సంగ‌తి తెలిసిందే. మూవీ ఫ్లాప‌వ‌డంతో, ఆ సినిమాలోని ఇదేమిట‌మ్మా మాయా మాయా మైకం క‌మ్మిందా అనే పాటకు కూడా రావాల్సినంత గుర్తింపు రాలేదు. పాట బావున్న‌ప్ప‌టికీ అప్ప‌ట్లో అదేమీ చార్ట్‌బ‌స్టర్ సాంగ్ కాదు. 

                                           వైర‌ల్ అవుతున్న డిజాస్ట‌ర్ మూవీ సాంగ్ అలాంటి డిజాస్ట‌ర్ సినిమాలోని సాంగ్, ఇప్పుడు వైర‌ల్ అవుతుంది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా వ‌చ్చిన తాజా సినిమా కె ర్యాంప్ లో ఈ సాంగ్ బిట్ కు హీరో చేసిన డ్యాన్సులు ఆడియ‌న్స్ ను మెప్పించ‌డం వ‌ల్ల సోష‌ల్ మీడియాలో ఆ సాంగ్ కొత్త ప్రాణం పోసుకుంది. ఆ పాట ఈ జెన‌రేష‌న్ ను విప‌రీతంగా ఆక‌ట్టుకోవ‌డంతో పాటూ అందులో ఉన్న వైబ్ దాన్ని వైర‌ల్ అయ్యేలా మార్చింది. అంతేకాదు, అదే కె ర్యాంప్ మూవీలో ఇదేమిట‌మ్మా సాంగ్ తో పాటూ బాల‌కృష్ణ హీరోగా న‌టించిన స‌మ‌ర‌సింహా రెడ్డిలోని నంద‌మూరి నాయ‌క సాంగ్ కూడా ఉంది. స‌మ‌ర‌సింహా రెడ్డి హిట్ మూవీ. అయిన‌ప్ప‌టికీ నెటిజ‌న్లు ఆ సాంగ్ ను వ‌దిలేసి మ‌రీ రాజ‌శేఖ‌ర్ సాంగ్ ను వైర‌ల్ చేశారు. హిట్ సినిమా సాంగ్ అయినా స‌రే ఫ్లాప్ సినిమాలోని పాట‌కే జెన్Z నెటిజ‌న్లు ఓటేశారు. ఆల్మోస్ట్ ఆడియ‌న్స్ మ‌రిచిపోయిన సాంగ్ కు చాలా ఏళ్ల త‌ర్వాత వాటికి కొత్త ప్రాణం పోసి మ‌రీ దాన్ని ట్రెండ్ అయ్యేలా చేయ‌డం ఒక్క సోష‌ల్ మీడియాకే చెల్లింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *