టేస్టీ పీనట్ బటర్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!

చాలా మందికి వేరుశెనగ వెన్న (పీనట్ బటర్) అంటే చాలా ఇష్టం. కానీ మార్కెట్లో కొనుగోలు చేసిన పీనట్ బటర్ ఖరీదెక్కువగా ఉంటుంది. పైగా రసాయనాల కారణంగా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయితే దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది పిల్లల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

అవసరమైన పదార్థాలు

  • వేరుశెనగలు (పచ్చి లేదా వేయించినవి) – 2 కప్పులు
  • ఉప్పు – రుచికి సరిపడా
  • తేనె / చక్కెర – 1 లేదా 2 స్పూన్లు
  • నూనె (వేరుశెనగ లేదా ఏదైనా నూనె) – 1 లేదా 2 స్పూన్లు

తయారీ విధానం

  1. పచ్చి వేరుశెనగలు తీసుకుంటే, వాటిని మీడియం మంట మీద తేలికగా వేయించాలి.
  2. వేయించిన వేరుశెనగలను చల్లారనిచ్చి తొక్క తీసేయాలి.
  3. వేరుశెనగలను మిక్సర్/బ్లెండర్‌లో వేసి మెత్తగా చేసుకోవాలి. మొదట అవి పొడిలా ఉంటాయి, కొంత సమయం తర్వాత నూనె బయటకు వచ్చి పేస్ట్‌గా మారుతుంది.
  4. రుచికి ఉప్పు, తేనె లేదా చక్కెర జోడించాలి. అవసరమైతే 1–2 టీస్పూన్ల నూనె కలపాలి.
  5. క్రీమీ అయ్యే వరకు మళ్లీ బ్లెండ్ చేయాలి.
  6. గాలి రాకుండా కంటైనర్‌లో నిల్వ చేస్తే సరిపోతుంది.

నిల్వ విధానం

  • గది ఉష్ణోగ్రత వద్ద – 1–2 వారాలు
  • రిఫ్రిజిరేటర్‌లో – 1 నెల

చిట్కాలు

  • క్రంచీ పీనట్ బటర్ కావాలంటే కొన్ని పీనట్ లను చివర్లో ముతకలా రుబ్బి కలపండి.
  • ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు, కాబట్టి ఇది ఆరోగ్యకరంగా ఉంటుంది.
  • తినడం వల్ల త్వరగా కడుపు నిండినట్లు అనిపిస్తుంది.
  • ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగవచ్చు.
  • ఫిట్‌నెస్ డైట్‌లో బ్రెడ్/టోస్ట్, శాండ్‌విచ్‌లలో, పాలు లేదా స్మూతీలలో ఉపయోగించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *