ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలి: నిరుద్యోగుల పిలుపు

ఇది మన హక్కుల కోసం పోరాటం” – యువత నినాదం

రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతోంది. “ఇది రాజకీయ కార్యక్రమం కాదు, మన హక్కుల కోసం చేసే పోరాటం” అంటూ యువత స్పష్టంగా ప్రకటించింది. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం చేపట్టే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

వాట్సాప్, గ్రామగ్రూపుల్లో షేర్ చేయండి

ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని నాయకులు కోరారు. వాట్సాప్ స్టేటస్‌ల్లో పెట్టాలని, గ్రామాల్లో ఉన్న గ్రూపుల్లో విస్తృతంగా షేర్ చేయాలని సూచించారు. “ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు అని కాదు – మన ప్రోగ్రాం మనమే సక్సెస్ చేసుకోవాలి” అని పిలుపునిచ్చారు.

“సక్సెస్ అయితేనే ప్రభుత్వం దిగివస్తుంది”

ఉద్యమం సక్సెస్ అయితేనే ప్రభుత్వం స్పందిస్తుందని, లేకపోతే ఉద్యోగ నోటిఫికేషన్లు రావని నిరుద్యోగులు స్పష్టం చేశారు. “ప్రతి ఏట 20 వేల నుంచి 30 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు బాకీ ఉన్నాయి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దోపిడి రాజ్యం” అంటూ నినాదాలు

నిరసనలో భాగంగా
“దొంగల రాజ్యం – దోపిడి రాజ్యం”
అంటూ నినాదాలు చేశారు.
వీరమరణాలు పొందిన వారికి జోహార్లు అర్పిస్తూ, ఉద్యమాన్ని శాంతియుతంగా కానీ గట్టిగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఇండిరా పార్క్ కేంద్రంగా ఉద్యమం

ఈ ఉద్యమాన్ని హైదరాబాద్‌లోని ఇండిరా పార్క్ కేంద్రంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి నిరుద్యోగి, ప్రతి విద్యార్థి ఈ పోరాటంలో భాగస్వామి కావాలని కోరారు. “మన ఉద్యోగ స్మృతి ఎక్కడ పోయింది?” అంటూ ప్రశ్నిస్తూ, ఇక మౌనం వీడాల్సిన సమయం వచ్చిందని యువత స్పష్టం చేసింది

ఉద్యమంపై ఉత్కంఠ

ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఏకమవుతుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం మళ్లీ చర్చకు వచ్చింది. ఈ ఉద్యమానికి ఎంతమేర స్పందన వస్తుంది? ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? అన్నది వేచి చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *