విమానాశ్రయం విస్తరణ పేరుతో బుల్డోజర్ చర్యలు — రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో ఉద్రిక్తత

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో భారీ బుల్డోజర్ చర్యలు కొనసాగుతున్నాయి.

అధికారుల ప్రకారం… విమానాశ్రయం భద్రత, విస్తరణ, మరియు అంతర్జాతీయ ప్రమాణాల అభివృద్ధి కోసం ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. అయితే స్థానికులు మాత్రం తమ నివాసాలు, తాత్కాలిక నిర్మాణాలు అకస్మాత్తుగా కూల్చివేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడ భారీగా బుల్డోజర్లు పనిచేస్తుండగా… కొంతమంది బాధితులు ముందస్తు నోటీసులు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. విదేశీ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ చర్యలపై ప్రజల్లో అనేక ప్రశ్నలు లేవుతున్నాయి.

“బుల్డోజర్… బుల్డోజర్…” అంటూ నిరసనలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు దీన్ని అభివృద్ధి చర్యగా సమర్థిస్తుండగా… మరికొందరు పేదల జీవనాధారాలపై దెబ్బగా అభివర్ణిస్తున్నారు.

ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ… భద్రతా బలగాలు భారీగా మోహరించబడ్డాయి. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఇది అభివృద్ధి అవసరమా? లేక ప్రజల హక్కులపై దెబ్బనా?
ఇంకా పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *