సోమగూడ ప్రెస్ క్లబ్ వేదికగా బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో 42% బీసీ రిజర్వేషన్ కోసం కీలక ప్రెస్ మీట్ జరిగింది. రాష్ట్రంలో బీసీ జనాభా ఆధారంగా 42% రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను బీసీ సంఘాలు వెల్లడించాయి.
ఇందిరా పార్క్లో 24వ తేదీన విజయవంతంగా నిర్వహించిన మహాధరణ అనంతరం, ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా మరింత బలంగా కొనసాగనుంది. బీసీ సాధన సమితి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం:
- 4వ తేదీ: మండల కేంద్రాలలోని ఎంఆర్ఓ కార్యాలయాలకు వినతిపత్రాల సమర్పణ
- 6వ తేదీ: జగిత్యాల, వరంగల్, హైదరాబాద్ సహా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద వినతి పత్రాల సమర్పణ
- 10వ తేదీ: కాంగ్రెస్ కామారెడ్డిలో ఇచ్చిన బీసీ రిజర్వేషన్ డిక్లరేషన్ వేదిక వద్ద మహాసభ మరియు మహాధర్నా
- బీసీ నేతలు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన 42% రిజర్వేషన్ హామీలు, 20,000 కోట్ల బడ్జెట్, బీసీ స్కాలర్‌షిప్స్, కుల సంఘాల ఫెడరేషన్లు వంటి అంశాలు ఇప్పటి వరకూ అమలు కాలేదని విమర్శించారు.
- “మాటలతో కాదు, చట్టాలతో నిరూపించాలి. నైన్త్ షెడ్యూల్‌లో చేర్పు, పార్లమెంట్ చట్టం తప్ప 42% రిజర్వేషన్ సాధ్యం కాదు” అని స్పష్టం చేశారు.
- అలాగే నామినేటెడ్ పోస్టుల్లో, మంత్రిత్వంలో బీసీలకు తగిన ప్రాధాన్యతలేమీ లేదని, సామాజిక న్యాయం కేవలం నినాదంగా మిగిలిందని తెలిపారు.
- ఒక్క రాజకీయ పార్టీ కూడా నిజంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకోదు — ఉద్యమం లేకుంటే మమ్మల్ని మోసం చేస్తారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- ప్రస్తుత రాజకీయ వ్యవస్థ బీసీలను మోసం చేస్తోందని, అవసరమైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమం బలోపేతం చేస్తారన్నారు.
- “తెలంగాణ ఉద్యమం తర్వాత, ఇప్పుడు బీసీ – ఎస్సీ – ఎస్టీ రాజ్యాధికార ఉద్యమం రాబోతోంది. ఇది ప్రజల పోరాటం, వెనకడుగు లేదు” అని హెచ్చరించారు.
- బీసీ రిజర్వేషన్ ని అడ్డుకుంటున్న రాజకీయ పార్టీల అసలు రంగు ప్రజల ముందే బట్టబయలు చేస్తామని బీసీ సంఘాలు స్పష్టం చేశాయి.

