సెలబ్రిటీలపై రూమర్లు.. హీరోయిన్ల సెటైరికల్ రిప్లైలు వైరల్

సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో, ఏదైనా ఒక వార్త బయటకు వస్తే అది ఎంతవరకు నిజమో ఆలోచించకుండా నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన గాసిప్స్, రూమర్లు సోషల్ మీడియాలో సుడిగాలి లా పాకిపోతుంటాయి. ఫలానా హీరోయిన్ ఎవరో హీరోతో ప్రేమలో ఉందని, ఇంకొకరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, కొందరు తల్లిదండ్రులు కాబోతున్నారని వార్తలు ఊహాగానాలుగా వస్తూనే ఉంటాయి.

అయితే కొందరు తారలు వాటిని లైట్‌గా తీసుకుంటే, మరికొందరు మాత్రం వాటిపై సీరియస్‌గా స్పందిస్తున్నారు. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ రూమర్లపై హాస్యంగా స్పందిస్తూ, “16 నెలలుగా ప్రెగ్నెంట్‌గా ఉండటం వరల్డ్ రికార్డ్ కదా!” అంటూ సరదాగా రిప్లై ఇచ్చారు.

ఇక సౌత్ క్యూటీ త్రిషా పెళ్లి వార్తలు కూడా తరచుగా వస్తూనే ఉంటాయి. దీనిపై ఆమె “నా లైఫ్ ప్లాన్ చేస్తున్న వాళ్లను నేను లవ్ చేస్తాను. హనీమూన్ షెడ్యూల్ కూడా చెబుతారేమో అని వెయిట్ చేస్తున్నా” అంటూ సెటైరికల్ రిప్లై ఇచ్చారు.

సీతారామం సినిమా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా తనపై వచ్చిన పెళ్లి వార్తలపై చమత్కారంగా స్పందించారు. “నా ఫ్రెండ్స్, బంధువులు అందరూ ఫోన్ చేసి ఏ తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నావని అడుగుతున్నారు. ఆ అబ్బాయి ఎవరో నేనూ తెలుసుకోవాలని ఉంది!” అంటూ సరదాగా చెప్పింది.

తెలుగు భామ అంజలి మాత్రం తనకు తెలియకుండానే నెటిజన్లు నాలుగు సార్లు పెళ్లి చేసేశారని హాస్యంగా చెప్పారు. “తను అవుట్‌డోర్స్ షూటింగ్‌లోనే ఎక్కువగా ఉంటున్నాను, పెళ్లికి ఇంకా టైమ్ ఉంది” అంటూ క్లారిటీ ఇచ్చారు.

ఇక ప్రభాస్, అనుష్క, శృతి హాసన్, అనుపమ, తమన్నా వంటి స్టార్స్ కూడా ఇలాంటి రూమర్లకు తరచూ గురవుతుంటారు. అయితే, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్త నిజం కాకపోవచ్చని, అభిమానులు వాస్తవాలను తెలుసుకుని షేర్ చేయాలని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *