రేవంత్ రెడ్డి గారి నాయకత్వంపై విశ్వాసంతో చొప్పదండి మున్సిపాలిటీలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఘన విజయాన్ని అందించారని స్థానిక నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
గెలిచిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు, ఈ విజయానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయంతో పార్టీపై మరింత బాధ్యత పెరిగిందని, ప్రజలకు మరింత అంకితభావంతో సేవ చేస్తామని పేర్కొన్నారు.
గత రెండు సంవత్సరాలుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు విశ్వాసం ఉంచి ఈ తీర్పు ఇచ్చారని అన్నారు. భవిష్యత్తులో మరింత అందుబాటులో ఉండి సేవ చేస్తామని, ఇచ్చిన ప్రతి హామీని ఆయా వార్డుల్లో తప్పకుండా నెరవేర్చుతామని హామీ ఇచ్చారు.
మరోసారి చొప్పదండి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ఎంపిక విషయంలో గెలిచిన కౌన్సిలర్ల అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి పంపించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

