దేశంలో మొదటిసారి ఎన్నికల్లో డ్రోన్స్..
జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు డ్రోన్లతో అనుసంధానం
దేశంలో మొదటిసారి ఎన్నికల్లో డ్రోన్స్ ఉపయోగం..
పోలింగ్ బూత్‌ల వద్ద డ్రోన్లతో పర్యవేక్షణ
ఎప్పటికప్పుడు డ్రోన్ విజ్యువల్స్‌ను పర్యవేక్షిస్తున్న సిబ్బంది..
ప్రతి పోలింగ్ లొకేషన్‌కి ఒక డ్రోన్.. 139 పోలింగ్ లొకేషన్స్‌లో 139 డ్రోన్లు..
డ్రోన్లు ఎగిరేయడానికి DGCA, లోకల్ పోలీసుల నుంచి పెర్మిషన్ తీసుకున్న ఎన్నికల అధికారులు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఈసారి ఓ కొత్త సాంకేతిక ప్రయోగం జరిగి దేశవ్యాప్తంగా దృష్టి ఆకర్షిస్తోంది. దేశంలో తొలిసారిగా ఎన్నికల పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగించడం విశేషం. ఎన్నికల వ్యవస్థలో టెక్నాలజీని వినియోగించి పారదర్శకత, భద్రతను పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, అన్ని డ్రోన్లను లైవ్ ఫీడ్‌తో అనుసంధానం చేశారు. డ్రోన్లు నిరంతరం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితులను చిత్రీకరిస్తూ, ఆ విజువల్స్ కంట్రోల్ రూమ్‌కు పంపుతున్నాయి.
మొత్తం 139 పోలింగ్ లొకేషన్లలో 139 డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. ప్రతి కేంద్రం పరిస్థితిని రియల్ టైమ్‌లో పరిశీలిస్తూ, ఏవైనా గందరగోళ పరిస్థితులు ఎదురైతే వెంటనే చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు.
డ్రోన్ల వినియోగానికి ముందు DGCA (Directorate General of Civil Aviation) మరియు లోకల్ పోలీసుల అనుమతులు పొందినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ సాంకేతిక పద్ధతితో పోలింగ్ మరింత పారదర్శకంగా, సురక్షితంగా జరుగుతుందని అధికార వర్గాలు నమ్ముతున్నాయి.
దేశంలోనే తొలిసారి ఎన్నికల నిర్వహణలో డ్రోన్లను వినియోగించడం టెక్ ఆధారిత ప్రజాస్వామ్య వ్యవస్థకు కొత్త దిశగా పరిగణించబడుతోంది

