హైకోర్ట్ స్టే: రోనాల్డ్ రోస్ కేసు Telanganaలో IAS వ్యవస్థపై పెద్ద ప్రశ్నలు!

హైదరాబాద్‌: తెలంగాణకు కేటాయింపుపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. డీఓపిటి చేసిన అపీల్‌పై హైకోర్టు విచారణ చేపట్టగా, వచ్చే ఆరు వారాల పాటు కేసును వాయిదా వేసింది. దీంతో ఐఏఎస్ రోనాల్డ్ రోస్ పోస్టింగ్ మీద మరోసారి చర్చ మొదలైంది.

ఈ వ్యవహారం కేవలం పోస్టింగ్ కాదని, తెలంగాణలో ఐఏఎస్ అధికారుల వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూపే ఉదాహరణగా ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

“వర్తమాన తెలంగాణలో ఐఏఎస్ అంటే పవర్ కాదు… బంగారం కింద పట్టు!”

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అధికారుల్లో చాలా మందిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. Telanganaలో ఐఏఎస్ అధికారులకు పదవులు కేవలం పేపర్‌పై బాధ్యతలు కాదు – ఒకేసారి వ్యవసాయ భూములు, బంగారు రియల్ ఎస్టేట్, ఒప్పందాలు, కమిషన్లకు ఓపెన్ గేట్ అని విమర్శలు వినిపిస్తున్నాయి.

సోమేష్ కుమార్ నుంచి నవీన్ మిట్టల్, దాన కిషోర్ నుంచి ఇతర అధికారుల వరకు — చాలా మందిపై పెద్ద ఎత్తున స్థిరాస్తి, అక్రమ సంపద ఆరోపణలు ఉన్నప్పటికీ ఎవరూ జైలుకు వెళ్లలేదు.

కేంద్రంలో దమ్ముంటే.. ఇవే స్క్యామ్‌లు ఇతర రాష్ట్రాల్లో చేసి చూపించండి!”

పలువురు ఐఏఎస్ అధికారులు తెలంగాణలో మాఫియా విధానంలో వ్యవహరిస్తున్నారని విమర్శకులు చెబుతున్నారు.

  • అక్రమ లేఅవుట్లు
  • రియల్ ఎస్టేట్ ఒప్పందాలు
  • ఇండస్ట్రియల్ అనుమతుల కమిషన్లు
  • ప్రాజెక్టులపై శాతం

వీటంతా అధికారుల జేబులోకి వెళ్లే డబ్బులేనని ఆరోపిస్తున్నారు.

ఈ అధికారం Telangana ప్రజల రక్తం, బడ్జెట్ కాదు!”

ఒక్కరోజులో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, విలాసవంతమైన బంగ్లాలు, దేశం బయట ఇన్వెస్ట్‌మెంట్లు — ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రభుత్వ జీతంలోనా? లేక ఒప్పందాల్లోనా?

ప్రజల ప్రశ్న ఇది:
👉 “సైకిల్‌తో సర్వీస్‌లోకి వచ్చి… లగ్జరీ కార్లు, ఫార్మ్ హౌసులతో బయటికి ఎలా వెళ్తున్నారు?”

సమాధానం ఒక్కటే: విచారణ

డీఓపిటి, కేవలం పోస్టింగ్‌లు పంపడం కాదు — వీరందరి ఆస్తులపై ఫోకస్ చేయాలి.

పదవులు కాదు, పబ్లిక్ సిస్టమ్‌కి న్యాయం కావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *