ఆ హీరోయిన్‌కు కేటీఆర్ వంద కోట్లు ఇచ్చారంటూ కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం సంచలన ఆరోపణలు

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ (పీసీపీ) నాయకుడు గజ్జెల కాంతం సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, కేటీఆర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ రాజకీయ వర్గాల్లో కలకలం రేపారు.

గజ్జెల కాంతం మాట్లాడుతూ, 2022 జనవరి 24న ఓ కాంట్రాక్టర్, జ్యువెలరీ షాప్ యజమాని ఖాతాల నుంచి ఓ హీరోయిన్‌కు కేటీఆర్ రూ.100 కోట్లు పంపించారని ఆరోపించారు. ఆ డబ్బు మూలం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అదే ఏడాది మార్చి 3న మైసూర్‌లో షూటింగ్ చేస్తున్న ఆ హీరోయిన్‌ను బెదిరించి ఢిల్లీలోని లలిత్ హోటల్ గది నెంబర్ 770కి పిలిపించారని, రూ.50 కోట్లు ఇస్తానని ఒత్తిడి తెచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ముంబైలోని తాజ్ కృష్ణా హోటల్ రూం నెంబర్ 328కు పిలిపించి రూ.35 కోట్ల 75 లక్షలతో విల్లా కొనిచ్చారని, ఆడి కారు కూడా బహుమతిగా ఇచ్చారంటూ ఆరోపించారు.

ఇవి మాత్రమే కాకుండా, కేసీఆర్ కుటుంబం అమెరికాలో రూ.40 వేల కోట్లకు పైగా, దుబాయ్‌లో రూ.25 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టిందని, రాష్ట్రంలో దాదాపు 30 వేల ఎకరాల భూములు అక్రమంగా దోచుకున్నారని ఆయన ఆరోపించారు. కేటీఆర్‌కు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తూ, ఇవన్నీ అబద్ధాలైతే తన కుమారుడిపై ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు

.కేసీఆర్ రాజకీయ జీవితంపై కూడా గజ్జెల కాంతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు రాజకీయ భిక్షతోనే కేసీఆర్ ఎదిగారని, దొంగ పాస్‌పోర్టుల వ్యవహారంలో కూడా ఆయన పాత్ర ఉందని విమర్శించారు. నాలుగు రాష్ట్రాల్లో కేటీఆర్‌కు ఆస్తులు ఉన్నాయని, ఎన్నికల సమయంలో జగన్‌కు రూ.200 కోట్లు పంపించారని, మహారాష్ట్ర, బీహార్, పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు కూడా కోట్ల రూపాయలు తరలించారంటూ ఆరోపణలు చేశారు.

రాహుల్ గాంధీ కుటుంబంపై కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చరించిన గజ్జెల కాంతం, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ, రాహుల్ గాంధీలేనని అన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిందని, వారి వల్లే కేటీఆర్ మంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. మరోసారి రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ వ్యాఖ్యలు పలు యూట్యూబ్ ఛానల్స్‌లో ప్రసారం కావడంతో వైరల్‌గా మారాయి. అయితే గజ్జెల కాంతం ఉపయోగించిన భాషపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు, కేటీఆర్ లేదా బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఇప్పటివరకు ఈ ఆరోపణలపై అధికారిక స్పందన వెలువడలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *