జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత భర్త గోపన్న మరణం సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ కీర్తి లతా గౌడ్ గారు. “చావు అనేది ఎవరి చేతిలో ఉండదు. ఒక మహిళ తన భర్తను కోల్పోతే ఆవేదన సహజం. దానిని రాజకీయంగా ఉపయోగించడం దారుణం,” అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
మినిస్టర్ల వ్యాఖ్యలపై కూడా స్పందిస్తూ, “మహిళల పట్ల కనీస మానవత్వం ఉండాలి. ఇది ఏ పార్టీకి, ఏ సంఘానికి సంబంధించినది కాదు — ఒక మహిళను అవమానించడం చాలా పెద్ద తప్పు,” అని చెప్పారు.
అదే సమయంలో, కీర్తి లతా గౌడ్ ఫేక్ ఓటర్ ఐడీల వివాదంపై కూడా స్పందించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఓటర్ ఐడీలు పంచుతున్నారని ఆరోపిస్తూ, “ఇలాంటి దొంగ చర్యలను బహిర్గతం చేసేందుకు బీఆర్ఎస్ ఎలక్షన్ కమిషన్‌లో కేసులు వేస్తుంది,” అని తెలిపారు.
బీసీ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడుతూ, “42% రిజర్వేషన్ ఇవ్వడం కేవలం ప్రజలను మోసం చేసే ప్రయత్నం. ఇది కేంద్రం నైన్త్ షెడ్యూల్‌లో చేర్చకపోతే అమలు కాలేదు. రేవంత్ రెడ్డి కడుపులోనుండి చిత్తశుద్ధి ఉంటే, జయలలిత లాగా పోరాటం చేయాలి,” అని వ్యాఖ్యానించారు.
ఆమె ప్రకారం, తెలంగాణలో బీఆర్ఎస్ అభివృద్ధి పట్ల ప్రజల్లో ఇంకా విశ్వాసం ఉందని, జూబ్లీహిల్స్‌లో కూడా అదే గెలుపును తిరిగి సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

