జూబిలీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. ఈ ఎన్నికలో అభివృద్ధి, సానుభూతి మరియు రాజకీయ సంప్రదాయాలపై ఘర్షణాత్మక మాటల యుద్ధం కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి జరిగిన రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యాఖ్యలు చేశారు.
20 నెలల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ప్రజలు చూశారని, జూబిలీహిల్స్‌లో గెలిపిస్తే ఇదే తరహాలో అభివృద్ధి చేస్తామని అన్నారు. “మూడు సార్లు గెలిచినా జరగని అభివృద్ధి, నాలుగోసారి గెలిస్తే జరుగుతుందా?” అని బీఆర్ఎస్పై ఆయన ప్రశ్నించారు.
అభ్యర్థి నవీన్ యాదవ్‌తో కలిసి నిర్వహించిన రోడ్‌షోలో రేవంత్ మాట్లాడుతూ, సెంటిమెంట్ కాదు — అభివృద్ధిని గెలిపించాలన్నారు. మాగంటి గోపీనాథ్ కుటుంబంపై సానుభూతి ఉందని, కానీ రాజకీయాల్లో పనులు మాట్లాడాలని అన్నారు.
అజారుద్దీన్ మంత్రిత్వంపై విమర్శలకు సమాధానంగా, “అతను ఓడినా మంత్రి చేశాను” అని స్పష్టం చేశారు. అయితే అదే విషయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రచార ఆయుధంగా వాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
అతను 2007లో పిజీఆర్ మరణించినప్పుడు అప్పటి చంద్రబాబు–బీజేపీ కుటుంబ అభ్యర్థిని ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నించారని గుర్తు చేశారు. “ఆ మంచి సంప్రదాయాన్ని తొక్కి దృష్ట రాజకీయాలు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీనే” అని ఆరోపించారు.
“బీఆర్ఎస్ పనిమీద మాట్లాడలేక గత ప్రభుత్వాన్ని నిందించడమే చేస్తున్నది. ప్రజలు బాగా గమనిస్తున్నారు,” అని సీఎం పాఠం చెప్పారు.

