రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే తీరు, వాడుతున్న భాషపై విమర్శలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. రెండు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఆయన తన పాత రాజకీయ శైలి నుండి బయట పడలేకపోయారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ప్రజాపాలన పేరుతో విస్తృత పర్యటనలు నిర్వహిస్తున్నప్పటికీ, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావడం లేదని, ఖాళీ కుర్చీల ముందే ఉపన్యాసాలు చేస్తున్నారని విమర్శకులు చెబుతున్నారు.
పదవిలో ఉన్న నాయకులు మాట్లాడే భాషలో బాధ్యత, గౌరవం, పరిపక్వత ఉండాలి అనేది సాధారణ అంచనా. చిన్న సర్పంచ్ నుండి పెద్ద ప్రజాప్రతినిధి వరకు పదవి వస్తే భాష, ప్రవర్తన, వ్యవహారశైలి లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ దగ్గర అలాంటి బాధ్యతా భావం కనిపించడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొన్ని నెలల క్రితం ఆయన భాషలో కొంత మార్పు వచ్చిందని కొంతమంది భావించినా, గత కొద్ది రోజులుగా మళ్లీ అసభ్య పదజాలం, ఘాటు వ్యాఖ్యలు, వ్యక్తిగత ఆరోపణలు, అవమానకర వ్యాఖ్యలు పెరగడం గమనార్హం.
ప్రత్యేకంగా దేవరకొండలో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ కార్యకర్తలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మేము మా ముఖ్యమంత్రిని అని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నాం” అని కొంతమంది నేతలు ఫోన్‌లో స్పందించారని సమాచారం.
ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్, నల్లగొండ అభివృద్ధి, గత ప్రభుత్వ నిర్ణయాలపై చేసిన విమర్శలు రాజకీయ చర్చనీయాంశంగా మారాయి.
విమర్శకుల మాటల్లో:
👉 “ప్రజలు మాటల యుద్ధం కాదు, పనులు కావాలి. బాధ్యత ఉన్న పదవిలో ఉండి అసభ్య భాష వాడటం ప్రజాస్వామ్యానికి మైనస్.”
👉 “ప్రజలు మాటల యుద్ధం కాదు, పనులు కావాలి. బాధ్యత ఉన్న పదవిలో ఉండి అసభ్య భాష వాడటం ప్రజాస్వామ్యానికి మైనస్.”
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చ ఒకటే—
📌 “పదవి ఒప్పుంది… కానీ పదవికి తగిన భాష ఎక్కడ?”

