తెలంగాణలో మరోసారి ఉద్యమ జ్వాలలు రగులుతున్నాయి.
ఆనాటి తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత్ చారి తన శరీరానికి పెట్రోల్ పోసుకొని బలిదానం చేసిన ఘటనను గుర్తు చేస్తూ, ఇప్పుడు అదే చరిత్రను మళ్లీ ప్రజలు చూస్తున్నారు.
బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతూ సాయి ఈశ్వరాచారి తనను తాను నిప్పంటించుకోవడం రాష్ట్రాన్ని కుదిపేసింది.
ఇద్దరు చిన్న చిన్న పిల్లలున్నా… కుటుంబం ఎలా బతుకుతుందని ఆలోచించే సమయం లేకుండా,
“బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి” అనే నినాదంతో ఆత్మ బలిదానం చేసుకున్నారు.
ఉద్యమ నాయకులు ఆగ్రహంతో విస్ఫోటనమయ్యారు:
“ఇది ఆత్మహత్య కాదు… ఈ ప్రభుత్వమే చేసిన హత్య.”
ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్‌లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ చెప్పి,
రెండేళ్ల పాలనలో మాట నిలబెట్టుకోలేదని వారు ఆరోపించారు.
ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చింది కేవలం 17% రిజర్వేషన్ మాత్రమే,
ఇది బీసీలకు అవమానం అని నేతలు మండిపడ్డారు.
✊ డిమాండ్లు:
- సాయిశ్వరాచారి కుటుంబానికి ₹1 కోటి పరిహారం
- ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం
- ఆయన పిల్లలకు ఎడ్యుకేషన్ మరియు భవిష్య భరోసా
- వెంటనే 42% బీసీ రిజర్వేషన్ అమలు
- బాధ్యులపై చర్య
నాయకులు హెచ్చరించారు:
“బీసీలకు న్యాయం until జరగకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రశాంతంగా ఉండదు.”

