తెలంగాణ జాగృతి సమాజంలో సమాన అవకాశాలు, సమాన హక్కులు అందించడానికి సామాజిక తెలంగాణ సాధనకు నాలుగు నెలల యాత్రను ప్రారంభించింది. ఈ యాత్రలో ప్రతి జిల్లా, మండల్, గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకొని, మహిళలు, యువత, రైతులు, పేద వర్గాల కోసం ఫలితాలను అందించడమే లక్ష్యం.
తెలంగాణలో ఇప్పటి వరకు సాధించిన భౌగోళిక తెలంగాణ కంటే సామాజిక తెలంగాణ ఇంకా పూర్తి స్థాయిలో సాధించబడలేదు. సామాజిక తెలంగాణ అంటే ప్రతి ఒక్కరికి, ఏ వర్గానికి చెందినా సమాన అవకాశాలు, సమాన గౌరవం, సమాన ప్రాధాన్యతలు రావడం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి తెలంగాణ జాగృతి ప్రజలతో నేరుగా మమేకమై, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం ముందడుగు వేస్తోంది.
జాగృతి ప్రతినిధులు ప్రతి జిల్లాల్లో రెండు రోజులు ఉండి, ప్రజలు, యువకులు, మహిళలు, నాయకులు, కార్యకర్తలతో సమాలోచనలు చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా సమాజంలో ఉన్న సమస్యలపై స్థిరమైన పరిష్కారం కోసం దిశా నిర్ధేశం చేయబడుతుంది. “జనం బాట” అనే పేరుతో చేపడుతున్న ఈ యాత్రలో సామాజిక తెలంగాణ సాధన కాబట్టి ప్రతి వర్గానికి, ప్రతి వ్యక్తికి ఫలితాలు అందేలా ప్రయత్నిస్తామని తెలిపారు.
తెలంగాణ జాగృతి నేతలు గుర్తు చేసినట్లుగా, సామాజిక తెలంగాణ సాధన కేవలం హైదరాబాద్లో కూర్చోని చర్చించడం ద్వారా సాధ్యం కాదు; ప్రతి గ్రామం, పట్టణం, మండల కేంద్రాలను చేరి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం, ప్రజలతో మమేకమై పరిష్కారం కోసం పని చేయడం అవసరం.

