ఫీల్డ్‌లో కనిపించని అధికారులు… రైతుల కన్నీళ్లు ఎవరు తుడుస్తారు?” – తెలంగాణలో వ్యవస్థపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పత్తి రైతులు ఆర్థిక, పంట సమస్యలతో అల్లాడుతుండగా, వారి బాధలు వినేవారే లేరని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల సమస్యలు తెలుసుకోవాల్సిన అధికారులు, నేతలు ఫీల్డ్‌లో తిరగకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

తాజాగా వచ్చిన విమర్శల ప్రకారం, ముఖ్యమంత్రి నుంచీ కలెక్టర్లదాకా – ప్రజల మధ్యలోకి వెళ్లే తపన కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికార యంత్రాంగం పనితీరు పూర్తిగా దెబ్బతిందని, ఈ పరిస్థితుల్లో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర నిరాశలోకి జారుతున్నారని విమర్శకులు చెబుతున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌ను ఉదాహరణగా చూపుతూ, అక్కడ ప్రతి ఐఏఎస్ అధికారి ఫీల్డ్‌లో యాక్టివ్‌గా తిరుగుతారని అంటున్నారు. కాని తెలంగాణలో కొంతమంది అధికారులు అనుచిత ప్రవర్తనకు కూడా పాల్పడుతున్నారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వసేవకు బదులు స్వప్రయోజనాల కోసం వ్యవస్థను వాడుకుంటున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కలెక్టర్ల నియామకాల్లో కూడా బెదిరింపులు, కులవివక్ష, వ్యక్తిగత ఇష్టాయిష్టాలు చోటుచేసుకుంటున్నాయనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను కదిలిస్తున్నాయి. ఈ వ్యవస్థ వల్లే రాష్ట్రంలో పలు వర్గాలు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రైతుల నుంచి విద్యార్థుల వరకూ అనేక మంది కన్నీళ్లు కార్చాల్సి వస్తున్నాయని ఆవేదన వ్యక్తమవుతోంది.

ఇటీవలి కాలంలో బోరబండలో ఓ మహిళ చేసుకున్న ఆత్మహత్య సంఘటన కూడా రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఇలాంటి ఘటనలు పెరుగుతుండటంతో, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు యంత్రాంగం కూడా రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాల కోసం పనిచేస్తోందనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ వ్యవస్థ ప్రజా సమస్యలను నిజంగా వినుతోందా? అధికారుల బాధ్యత ఎక్కడ నష్‌టమైందీ? రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం ఎప్పుడు లభిస్తుంది? అనే ప్రశ్నలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *