జనాభా లెక్కల శాంపిల్ సర్వే నవంబర్ 10 నుంచి – తెలంగాణలో రెండు మండలాలు, ఒక జిహెచ్ఎంసి వార్డు ఎంపిక

భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనాభా లెక్కల్లో భాగంగా హౌస్ లిస్టింగ్ శాంపిల్ సర్వేను నవంబర్ 10 నుంచి నవంబర్ 30 వరకు నిర్వహించనుంది. ఈ మేరకు కేంద్ర జనాభా లెక్కల రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ సర్వేలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు మండలాలు మరియు ఒక జిహెచ్ఎంసి వార్డును ఎంపిక చేశారు. వాటిలో —

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం
  • నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం
  • జిహెచ్ఎంసి పరిధిలోని 112వ వార్డు రామచంద్రపురం

ఈ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి గృహాల లెక్కలు సేకరిస్తారు. సర్వేలో ఇళ్ల సంఖ్య, వసతులు, నివాసుల సంఖ్య, కమ్యూనిటీ అవసరాలు వంటి వివరాలను మొత్తం 34 ప్రశ్నల ఆధారంగా యాప్ ద్వారా నమోదు చేయనున్నారు.

సర్వే కోసం 200 మంది సిబ్బంది పనిచేయనున్నారు — వీరిలో 160 మంది ఎంమరేటర్లు, 40 మంది సూపర్వైజర్లు ఉంటారు. వీరిలో ప్రభుత్వ, పంచాయతీ రాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖల సిబ్బంది ఎక్కువగా ఉంటారని సమాచారం. సిబ్బందికి నవంబర్ 2 నుంచి 4 వరకు శిక్షణ ఇవ్వనున్నారు.

ప్రతి ఎంమరేటర్ కనీసం 700 మంది జనాభాపై సర్వే చేయనున్నారు. ఈసారి కేంద్రం సెల్ఫ్ ఎన్నుమరేషన్ (Self Enumeration) సదుపాయం కూడా కల్పించింది. నవంబర్ 1 నుంచి 7 వరకు ప్రజలు స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు.

ఇక మరోవైపు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లు అంశం మరల చర్చకు వచ్చింది. బిఆర్ఎస్ వర్గాలు ప్రతిరోజు వందల సంఖ్యలో దొంగ ఓటర్ల ఐడీలు బయటపడుతున్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. “ఇంత పెద్ద సంఖ్యలో బోగస్ ఓట్లు ఎప్పుడు నమోదయ్యాయి? ఏ ప్రభుత్వ హయాంలో ఈ ఓటర్లు చేర్చబడ్డారు?” అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు వేడెక్కుతున్నాయి.

ప్రతిపక్షాలు కూడా ఈ అంశంపై స్పందిస్తూ, గత పది నుండి పదిహేను సంవత్సరాలుగా పక్క రాష్ట్రాల వ్యక్తులు ఓటర్ల జాబితాలో ఉన్నారని ఆరోపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ ఇప్పటికే దీనిపై ఫిర్యాదులు స్వీకరించిందని, త్వరలో విచారణ చేపడుతుందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *