రాష్ట్రంలో పత్తి, సోయాబీన్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతున్న సమయంలో, ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. రైతుల బాధలు విన్న తర్వాత, మార్కెట్ యార్డుల్లో జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీశారు.
“మీరు అన్నీ చక్కగా చేస్తున్నారు అనుకుంటే, రైతులు సంతోషంగా ఉంటే — మార్కెట్‌లు ఎందుకు బంద్?” అంటూ ప్రజల ముందే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రభుత్వం రైతులను కలవడానికి భయపడుతుందా? రైతుల వాస్తవ పరిస్థితులు బయట పడతాయనే భయం ఉందా? అంటూ నేరుగా ప్రశ్నలు సంధించారు.
రైతుల వాస్తవ కథలు — నేలమీద పరిస్థితి భయంకరం
లఖంపూర్‌లో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించినప్పుడు, 40 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న నారాయణరెడ్డి అనే రైతు తన బాధను వెల్లబోసుకున్నారు.
- “ఇంత దారుణ పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. పంట రంగు మారింది అంటున్నారు, కొంటలేరు అంటున్నారు. మాకు నష్టం తప్ప మరేం లేదు.”
అదే విధంగా పత్తి రైతులు కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు.
Kisan Kapas App పై రైతుల ఆగ్రహం
రైతులకు అందుబాటులో లేకుండా, పత్తి కొనుగోలును కిసాన్ కపాస్ యాప్ పై మాత్రమే ఆధారపడి చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు.
- ఆదిలాబాద్‌లో నెట్‌వర్క్ సమస్యలు
- వృద్ధ రైతులు యాప్ వాడలేకపోవడం
- వేలిముద్రలు అవసరం అని insist చేయడం
- పెద్దవాళ్లకు దూరప్రాంతాలకు రావాల్సిన ఇబ్బంది
ఒక రైతు కుటుంబం ఉదాహరణగా చెప్పారు:
“55–60 ఏళ్ల అమ్మ ఫింగర్ ప్రింట్ పెట్టాలి అంటున్నారు… మేమేమైనా స్మగ్లర్లమా? రైతు పంట అమ్మడానికి పిల్లలు రావొద్దా?”
కొనుగోలు తగ్గింపు — రైతులకు భారీ నష్టం
సర్కార్ ఉన్నప్పుడు 5 లక్షల క్వింటాళ్లు కొనుగోలు అయ్యేదని, ఇప్పుడు మాత్రం లక్ష క్వింటాలే కొనలేకపోయిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహించారు.
- గతంలో ధర: ₹8000 పైగా
- ఇప్పటి ప్రైవేట్ ధర: ₹5900–₹6200
- రైతు ఒక్క క్వింటాల్ నష్టం: ₹1200–₹1400
ఇది లక్షలాది రైతులకు భారీ ఆర్థిక నష్టం కలిగిస్తోందని పేర్కొన్నారు.
మాయిశ్చర్ సమస్య — ప్రభుత్వం నిజాలు దాచి పెడుతోందా?
ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడటంతో మాయిస్చర్ శాతం పెరగడం సహజమేనని, దీనిని కారణంగా చూపి రైతులను తిరస్కరిస్తున్నారని విమర్శించారు.
“మునుపు 20–22% తేమ ఉన్నా సర్కారు కొనిపించింది. ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు?”
ఫింగర్ ప్రింట్ రూల్ ఉపసంహరణ — ‘మా రాకతో భయపడ్డారు’
నేతలు వస్తున్నారని తెలిసి, ప్రభుత్వం ఫింగర్ ప్రింట్ విధానాన్ని తొలగించడం, కొనుగోలు పరిమితిని 7 నుండి 10 క్వింటాళ్లకు పెంచడం యాదృచ్ఛికం కాదని పేర్కొన్నారు.
“మేము రానున్నామని తెలిసి చర్యలు తీసుకున్నారు… నిజంగా రైతులపై ప్రేమ ఉంటే క్యాబినెట్‌లోనే నిర్ణయం తీసుకునేవారు.”
రైతులకు నష్టపరిహారం — స్పష్టమైన డిమాండ్
అతివృష్టి, మారిన పంట నాణ్యత కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు
ఎకరాకు ₹20,000 పరిహారం ప్రకటించాలి అని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా:
- పత్తి కొనుగోలు పరిమితిని 13 క్వింటాళ్ల వరకు పెంచాలి
- మాయిస్చర్ లిమిట్‌ను 20–22% వరకు అనుమతించాలి
- సిసిఐ ముందు రైతుల తరపున పోరాడతామని హామీ ఇచ్చారు

