ప్రతి ఒక్కరూ తమ రోజు నవ్వులు, సంతోషం, సానుకూలతతో నిండి ఉండాలని కోరుకుంటారు. దీనికి ఉదయం ప్రారంభం చాలా ముఖ్యం. అయితే ఉదయం లేవగానే ఎవరి ముఖాన్ని మొదట చూస్తారు అనేదానిపై రోజు ఎలా ఉంటుందనేది ఆధారపడి ఉంటుందని చెబుతారు. ఉదయం శుభప్రదంగా, సానుకూల శక్తితో ప్రారంభించడానికి ఎవరి ముఖం చూడటం శ్రేయస్కరమో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఉదయం శుభప్రదమైన ముఖాలు:
తల్లిదండ్రుల ముఖాలు: ఉదయం నిద్ర లేవగానే తల్లిదండ్రుల ముఖాలను మొదట చూడటం అత్యంత శుభప్రదంగా చెబుతారు. దీనివల్ల రోజంతా సానుకూల శక్తితో గడపవచ్చని, మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుందని నమ్ముతారు. అంతేకాక రోజువారీ పనులలో విజయం సాధిస్తారని చెబుతారు.
జీవిత భాగస్వామి- పిల్లల ముఖాలు: నిద్ర లేవగానే మీ జీవిత భాగస్వామి లేదా పిల్లల ముఖాలను చూడటం వల్ల ఆ రోజు మీకు బాగా కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. పిల్లలు, జీవిత భాగస్వామి జీవితంలో సంతోషానికి చిహ్నాలుగా భావిస్తారు. వీరిని చూడటం ద్వారా రోజంతా సానుకూల అనుభూతిని పొందవచ్చు.
దేవుడి పటాలు : ఉదయం లేవగానే దేవుడి పటాన్ని చూస్తే.. రోజంతా సానుకూల శక్తితో నిండి ఉంటుంది. దీనివల్ల మేల్కొన్న వెంటనే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే పనుల్లో ఏకాగ్రత పెరిగి విజయం లభిస్తుంది.
గురువు-గౌరవనీయ వ్యక్తి ముఖం: గురువు, గౌరవించే వ్యక్తి ముఖాన్ని ఉదయం మొదట చూడటం కూడా చాలా శుభప్రదంగా చెబుతారు. ఇది మానసిక శాంతిని, ఏకాగ్రతను పెంచుతుంది. అలాగే ఒక వ్యక్తి నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది.
ఉదయం చేయవలసిన పనులు: ఉదయం లేవగానే మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి.. మొదటగా గోరువెచ్చని నీటిని తాగాలి. ఇది డీహైడ్రేషన్ జరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. వివిధ శారీరక సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఆ తర్వాత తేలికపాటి వ్యాయామం చేయడం ద్వారా శరీరం చురుకుగా ఉండి.. ఫిట్‌నెస్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది. మొదటగా దేవుడిని తలచుకోవడం, లేదా ఇష్టమైన వారి ముఖం చూడటం ద్వారా ఆ రోజును ఆనందంగా, సానుకూలంగా ప్రారంభించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

