తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ — హైకోర్టు తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ
తెలంగాణ రాష్ట్ర రాజకీయ వాతావరణం నేడు బీసీ రిజర్వేషన్ల చుట్టూ మండి పోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వనుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన కీలక సమావేశంలో ఈ అంశంపై సమగ్రంగా చర్చించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం…

