Headlines

పంచాయతీ ఎన్నికల్లో బీసీలదే పైచేయి: జనరల్ స్థానాల్లో 52.75% విజయం, రాష్ట్రవ్యాప్తంగా విజయ బావట

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలు (బీసీలు) ఘన విజయం సాధించాయి. బీసీలకు రిజర్వ్ చేసిన స్థానాలకే పరిమితం కాకుండా, జనరల్ కేటగిరీ సీట్లలో కూడా అత్యధికంగా విజయం సాధించడం ఈ ఎన్నికల ప్రత్యేకతగా నిలిచింది. మొత్తం జనరల్ స్థానాల్లో ఏకంగా 52.75 శాతం బీసీలే గెలుచుకోవడం రాజకీయంగా కీలక పరిణామంగా భావిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 12,733 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా, అందులో బీసీలకు 2,275 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. ఎస్సీ,…

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: సజ్జనార్ నేతృత్వంలో బలోపేతమైన సిట్, నెలలో దర్యాప్తు పూర్తి ఆదేశాలు

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొనసాగుతున్న సిట్ దర్యాప్తును మరింత బలోపేతం చేస్తూ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో తొమ్మిది మంది సీనియర్ పోలీస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేస్తూ, నెలరోజుల్లో దర్యాప్తును పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్, సిద్ధిపేట…

Read More

గ్రూప్–3 తుది జాబితా విడుదల: 1370 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

గ్రూప్–3 పరీక్షలకు సంబంధించిన తుది ఎంపిక జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన గ్రూప్–3 పరీక్షల ఫలితాలు ఇప్పటికే ప్రకటించగా, ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యాక గురువారం తుది జాబితాను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 1,370 పోస్టుల భర్తీ కోసం 2022 డిసెంబర్‌లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు అనుగుణంగా 2023 నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్–3 పరీక్షలు నిర్వహించారు. అనంతరం…

Read More

పంచాయతీ ఎన్నికల ఫలితాలే 2029 అసెంబ్లీ ఎన్నికలకు నాంది: సీఎం రేవంత్ రెడ్డి

2029లో కూడా ఇదే రీతిలో ఫలితాలు పునరావృతం అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్ని అందించిన ప్రజలకు, అలాగే కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా, అందులో 7,527 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు, 808 పంచాయతీల్లో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులు విజయం సాధించారని సీఎం వెల్లడించారు. రెబెల్స్‌తో కలిపి మొత్తం 8,335 పంచాయతీల్లో కాంగ్రెస్…

Read More

నేషనల్ హెరాల్డ్ నిరసనలు నుంచి ఎమ్మెల్యేల జంప్ డ్రామా వరకు.. సీఎం ప్రెస్‌మీట్‌పై పెరిగిన ప్రశ్నలు

ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు పలు కీలక మలుపులు తిరిగాయి. నేషనల్ హెరాల్డ్ కేసుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలు, ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై అభ్యంతరాలు, పంచాయతీ ఎన్నికల ఫలితాలు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన ఆకస్మిక ప్రెస్‌మీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నిన్న నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన ఈడీ చర్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. అదే సమయంలో…

Read More

నేషనల్ హెరాల్డ్ కేసు: ఈడీని ఆయుధంగా మార్చి ప్రతిపక్షాలపై దాడి – బీజేపీపై కాంగ్రెస్ ఫైర్

నేషనల్ హెరాల్డ్ కేసును కేంద్రంగా చేసుకుని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ – బీజేపీ మధ్య రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓకే టీవీతో మాట్లాడిన కాంగ్రెస్ నేత చరణ్ కౌశిక్, బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై పెట్టిన ఈడీ కేసులను ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో, ఆ విషయాన్ని దేశ…

Read More

నేషనల్ హెరాల్డ్ కేస్: ఈడీ నోటీసులతో కాంగ్రెస్‌ను భయపెట్టలేరు – బీజేపీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

నేషనల్ హెరాల్డ్ కేస్ నేపథ్యంలో కాంగ్రెస్ – బీజేపీ మధ్య రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంపై స్పందిస్తూ, ఇది ఇక్కడితో ఆగేది కాదని, ముందు ముందు పోరాటం మరింత ఉధృతమవుతుందని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా మార్చుకుని ప్రతిపక్ష నాయకులను బెదిరిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని దేశం మొత్తం…

Read More

టేస్టీ పీనట్ బటర్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!

చాలా మందికి వేరుశెనగ వెన్న (పీనట్ బటర్) అంటే చాలా ఇష్టం. కానీ మార్కెట్లో కొనుగోలు చేసిన పీనట్ బటర్ ఖరీదెక్కువగా ఉంటుంది. పైగా రసాయనాల కారణంగా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయితే దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది పిల్లల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అవసరమైన పదార్థాలు తయారీ విధానం నిల్వ విధానం చిట్కాలు

Read More

బిస్కెట్లు ఎల్లప్పుడూ టీతో తింటాం.. కానీ నిజమైన కారణం ఇది!

చాయ్‌తో బిస్కెట్లు తినే అలవాటు మనందరికీ ఉంది. అయితే ఎందుకు బిస్కెట్లను మాత్రమే టీతో తింటాం? స్వీట్లు, తీపి ఆహారాలు అయినా వాటిని టీతో కలపడం అంతం కాదు. దీని వెనుక ఓ ప్రత్యేక కారణం ఉంది. బిస్కెట్-టీ సంప్రదాయం బ్రిటన్‌లో బ్రిటిష్‌లు మొదట ఈ కాంబినేషన్‌ను ప్రారంభించారు. చైనా నుంచి టీ బ్రిటన్‌కు చేరడంతో, టీతో బిస్కెట్లు తేలికపాటి చిరుతిండిగా వడ్డించే సంప్రదాయం ఏర్పడింది. బిస్కెట్‌ను టీలో ముంచితే, అది వెంటనే మెత్తగా మారుతుంది. బిస్కెట్‌లోని…

Read More

వీరికి బెల్లం విషంతో సమానం.. తిన్నారంటే కొబ్బరిబొండంలా మారాల్సిందే!

బెల్లం అంటే చాలా మందికి ఆరోగ్యానికి మంచిదనే అభిప్రాయం ఉంటుంది. నిజమే… బెల్లంలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి సహజ పోషకాలు ఉన్నాయి. ప్రాసెస్ చేసిన చక్కెరతో పోలిస్తే బెల్లం సహజమైన తీపిని అందించడంతో పాటు శరీరానికి కొంత మేలు చేస్తుంది. అందుకే చాలామంది దీనిని ఒక సూపర్ ఫుడ్గా భావిస్తారు. కానీ అందరికీ బెల్లం సరిపోదన్నది చాలా మందికి తెలియని నిజం. ముఖ్యంగా బెల్లాన్ని ఎలా నిల్వ చేయాలి, ఎవరు తినకూడదు…

Read More