Headlines

ముఖ్యమంత్రి మాటల్లో మర్యాద మాయమా?” రేవంత్ భాషపై అసంతృప్తి పెరుగుతోంది

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే తీరు, వాడుతున్న భాషపై విమర్శలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. రెండు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఆయన తన పాత రాజకీయ శైలి నుండి బయట పడలేకపోయారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ప్రజాపాలన పేరుతో విస్తృత పర్యటనలు నిర్వహిస్తున్నప్పటికీ, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావడం లేదని, ఖాళీ కుర్చీల ముందే ఉపన్యాసాలు చేస్తున్నారని విమర్శకులు చెబుతున్నారు. పదవిలో ఉన్న నాయకులు మాట్లాడే భాషలో బాధ్యత, గౌరవం, పరిపక్వత…

Read More

గోవాలో నైట్‌క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం: 25 మంది మృతి, 50 మందికి గాయాలు

గోవాలోని ప్రముఖ బీచ్ పాయింట్ రోమియో లేన్ నైట్‌క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 50 మందికి పైగా గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో నలుగురు విదేశీ పర్యాటకులున్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో క్లబ్‌లో డ్యాన్స్ షో జరుగుతుండగా, స్టేజ్‌పై ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ ఫైర్ క్రాకర్లు పేలడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. కొద్ది సెకన్లలోనే అగ్ని క్లబ్ మొత్తం వ్యాపించడంతో…

Read More

ఓటు విలువ కోటరు సీసా కాదు – గ్రామ రాజకీయాలపై ప్రశ్నలు

గ్రామస్థాయిలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు ఓటు విలువను, ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే స్థాయికి చేరుకున్నాయి. ప్రత్యేకంగా, ఓటును కోటరు సీసాలు, చిన్న చిన్న తాయిలాలు ఇచ్చి కొనేసే పరిస్థితి బాధాకరంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “నోటికి ఓటు, ఊరికి వెన్నుపోటు” అనే విమర్శలు ఈ ఎన్నికల్లో మరింతగా వినిపిస్తున్నాయి. ఐదు వందల రూపాయల కోసం ఐదేళ్ల భవిష్యత్తు తాకట్టు పెట్టేయడం ప్రజాస్వామ్యంపై అవమానమా? అనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిని ఆలోచింపజేస్తోంది. ఒక సర్పంచ్ నెలజీతం ₹6,500 మాత్రమే….

Read More

ఓటు విలువ కోటరు సీసా కాదు – గ్రామ రాజకీయాలపై ప్రశ్నలు”

గ్రామస్థాయిలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు ఓటు విలువను, ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే స్థాయికి చేరుకున్నాయి. ప్రత్యేకంగా, ఓటును కోటరు సీసాలు, చిన్న చిన్న తాయిలాలు ఇచ్చి కొనేసే పరిస్థితి బాధాకరంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “నోటికి ఓటు, ఊరికి వెన్నుపోటు” అనే విమర్శలు ఈ ఎన్నికల్లో మరింతగా వినిపిస్తున్నాయి. ఐదు వందల రూపాయల కోసం ఐదేళ్ల భవిష్యత్తు తాకట్టు పెట్టేయడం ప్రజాస్వామ్యంపై అవమానమా? అనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిని ఆలోచింపజేస్తోంది. ఒక సర్పంచ్ నెలజీతం ₹6,500 మాత్రమే….

Read More

ఉద్యమకారుల హక్కులు ఎక్కడ? – ఆరు గ్యారంటీలపై ప్రజలు ప్రశ్నలు”

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ఇప్పుడు ప్రజలు గట్టిగా ప్రశ్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా, ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. “ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తాం” అన్న హామీ ఇంతవరకూ అమలు కాలేదని ఆగ్రహ స్వరాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఉద్యమంలో రక్తం, చెమట చిందించిన ప్రజలు… ఇప్పుడు తమ హక్కుల కోసం మళ్ళీ రోడ్ల మీదికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?…

Read More

గ్లోబల్ సమ్మిట్ పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారా? – మంత్రులపై సంచలన ఆరోపణలు”

తెలంగాణలో జరగబోతున్న గ్లోబల్ సమ్మిట్‌ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్లోబల్ సమ్మిట్ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ, రాష్ట్ర ప్రయోజనాల పేరుతో అసలు ఎవరికి లాభం చేకూరుతుందో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు తెచ్చిన పెట్టుబడులు ఎక్కడున్నాయి? ఏ కంపెనీలు వచ్చాయి? ఎంత పెట్టుబడి వచ్చింది? అన్న ప్రశ్నలకు ఇప్పటి వరకు ప్రభుత్వ నుంచి స్పష్టమైన సమాధానాలు రావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. “84వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాం” అని…

Read More

గ్లోబల్ సమ్మిట్ పేరుతో రాజకీయ షోనా? తెలంగాణకు అసలు లాభం ఎక్కడ?

తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ అంటూ భారీగా ప్రకటనలు, పోస్టర్లు, ఈవెంట్లు… కానీ అసలైన ప్రశ్న మాత్రం ఒక్కటే — “తెలంగాణ ప్రజలకు లాభం ఏమిటి?” ఇప్పటి వరకు రెండు సంవత్సరాలుగా దావోస్‌కు వెళ్లి, కోట్లాది రూపాయల పన్ను డబ్బుతో బృందాలు తిరిగాయి. “84 వేల కోట్లు డీల్స్ వచ్చాయి” అని చెప్పిన ప్రభుత్వం — ఆ డబ్బు ఎక్కడ? కంపెనీలు ఎక్కడ? ఉద్యోగాలు ఎక్కడ? ఐటీ శాఖ మంత్రులు బూట్లు వేసుకుని విదేశాలకు వెళ్లి ఫోటోలు దిగడం…

Read More

ఆంధ్రప్రదేశ్ స్కూల్ విద్యలో సంస్కరణలు: జగన్ ప్రారంభించిన P.T.M. వ్యవస్థను కొనసాగిస్తున్న టిడిపి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల స్థాయిని కార్పొరేట్ లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం గత కొంతకాలంగా విజయవంతంగా కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన ఇంగ్లీష్ మీడియం విద్య, నూతన స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ బోధన విధానం తదితరాలు విద్యార్థులలో స్పష్టమైన మార్పును తీసుకువచ్చాయి. పేద కుటుంబాల పిల్లలు కూడా ఆత్మవిశ్వాసంతో ఇంగ్లీష్ మాట్లాడటం ఈ మార్పుకు ఉదాహరణగా చెబుతున్నారు. సరికొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో Parent-Teacher Meeting (P.T.M) వ్యవస్థను ప్రవేశపెట్టడం రాష్ట్రంలో మరొక ముఖ్యమైన…

Read More

రాజకీయాల్లో రిటైర్మెంట్ కావాలి: యువతకు అవకాశం ఇవ్వాలని తీవ్ర డిమాండ్

తెలంగాణ రాజకీయాల్లో కొత్త తరం నాయకత్వం అవసరం ఉందని ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, ఉద్యోగాల్లో రిటైర్మెంట్ ఉన్నప్పటికీ, రాజకీయ నేతలకు రిటైర్మెంట్‌ వ్యవస్థ లేకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వృద్ధ నేతలు ఫీల్డ్‌లో తిరగలేని స్థితిలో ఉన్నప్పటికీ, పదవులు మాత్రం కావాలని, జీతాలు, సౌకర్యాలు, ప్రోటోకాల్‌లను ఆస్వాదిస్తూ కూర్చోవడం ప్రజాస్వామ్యానికి నష్టం అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “రాజకీయాల్లో కూడా వయస్సు పరిమితి ఉండాలి. పార్లమెంట్‌లో బిల్లు పెట్టే ధైర్యం ఉంటే పెట్టండి”…

Read More

గ్రామ కంఠ భూముల దందా: 12 లక్షల కోట్ల భూములు ప్రైవేటుకు? ప్రజల్లో ఆగ్రహం

తెలంగాణలో గ్రామ కంఠ భూముల వివాదం తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్రంలోని 12,000 పంచాయతీల్లో ఉన్న గ్రామ కంఠ భూములను ఒక ఢిల్లీ ప్రైవేట్ సంస్థకు 30 ఏళ్ల లీజుకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక పంచాయతీ ప్రతినిధులు లేని సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం, గ్రామసభల నిర్ణయాలను పక్కన పెట్టడం పట్ల ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. ప్రభుత్వం ‘హరిత సౌభాగ్యం’ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రాజెక్ట్‌ వెనుక భారీ ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని…

Read More