ఇండిగో సంక్షోభం: దేశవ్యాప్తంగా విమాన రద్దులు, ఇప్పటివరకు 827 కోట్ల రీఫండ్ – అసలు ఇష్యూ ఏంటి?
దేశంలో ప్రముఖ తక్కువ ధర విమాన సర్వీస్ నిర్వాహకురాలైన ఇండిగో సంస్థ సంక్షోభంలో పడింది. గత ఒక వారం నుంచి విమానాలు రద్దు కావడం, షెడ్యూళ్లు మారడం, విమానాశ్రయాల్లో ప్రయాణికుల ఆందోళనలు పెరగడం వల్ల పరిస్థితి తీవ్రంగా మారింది. గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న వివాదంతో ఇండిగో సేవలు దెబ్బతిన్నాయి. ముందస్తు సమాచారం లేకుండానే అనేక విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు గంటల కొద్దీ ఎయిర్‌పోర్ట్‌లలో చిక్కుకున్నారు. చాలా చోట్ల వీక్షణలు రైల్వే స్టేషన్లను పోలినట్టుగా కనిపించాయి…

