జీఓ 46పై బీసీ రాజకీయ నేతల ఆగ్రహం: రిజర్వేషన్లలో దగాపాటు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా, రిజర్వేషన్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో పార్టీకి చెందిన యాదగిరి గారు, విజయ్ కుమార్ గౌడ్ గారు సహా పలువురు నాయకులు మాట్లాడుతూ జీఓ 46 పేరుతో ప్రభుత్వం బీసీల హక్కులను హరిస్తోందని ఆరోపించారు. బీసీ జనాభా 50% కంటే ఎక్కువ ఉన్నా, వారికి కనీసం 42% రిజర్వేషన్ ఇవ్వాలని చట్టబద్ధంగా ప్రకటించిన…

