ఏపీకి పరిశ్రమల తరలింపు కుట్రా? – హిల్ట్ పాలసీపై తెలంగాణలో ఆందోళన
తెలంగాణలో పరిశ్రమల భవిష్యత్తుపై పెద్ద చర్చ మొదలైంది. ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీతో సుమారు 5,000 పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఏర్పడిందన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ నిర్ణయం వెనుక కొన్ని కీలక నేతల కుట్ర ఉందని పరిశ్రమల వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. తెలంగాణలోని పరిశ్రమల్లో 60% పైగా ఏపీ వాసుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చిన్న, మధ్య తరహా తయారీ యూనిట్లు కాలుష్య నియంత్రణ పేరుతో తరలించే నిర్ణయం పరిశ్రమల భవితవ్యాన్ని అనిశ్చితిలోకి…

