కరీబియన్‌లో భీకర మెలిసా హరికేన్: 174 ఏళ్లలోనే అత్యంత శక్తివంతమని నిపుణుల వ్యాఖ్యలు
కరీబియన్ సముద్రతీర దేశాలను మెలిసా హరికేన్ వణికిస్తోంది. ముఖ్యంగా జమైకాలో ఈ తుఫాన్ భారీ విధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఈ సంవత్సరం అత్యంత శక్తివంతమైన హరికేన్‌గానే కాకుండా, గత 174 ఏళ్లలో ప్రపంచం చూడని తీవ్రతతో ఇది దూసుకెళ్తోందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. తుఫాన్ ప్రభావంతో తీవ్ర గాలులు, భారీ వర్షాలు, సముద్ర అలలు విరుచుకుపడుతున్నాయి. రహదారులు, ఇళ్లు, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ప్రజలు భయాందోళనలతో సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు చెందిన…

