షేక్‌పేట్‌లో ఓటు హక్కు వినియోగించిన రాజమౌళి దంపతులు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికలో పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. సాధారణ ప్రజలతో పాటు సినీ రంగ ప్రముఖులు కూడా ప్రజాస్వామ్య పండుగలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తన భార్య రమతో కలిసి షేక్‌పేట్ డివిజన్ పరిధిలోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి విచ్చేసి తమ ఓటు హక్కును వినియోగించారు. రాజమౌళి దంపతులు ఎలాంటి ఆర్భాటం లేకుండా సాధారణ ఓటర్ల మాదిరిగానే క్యూలో నిలబడి ఓటు వేశారు….

Read More