హైదరాబాద్‌లో టిడిఆర్ బిగ్ స్కామ్ ఆరోపణలు: రియల్ ఎస్టేట్ రంగంలో భారీ దందా?
హైదరాబాద్ నగరంలో తాజాగా టిడిఆర్ (Transfer of Development Rights) బాండ్లపై భారీ స్కామ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ వ్యవహారం ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది. ముఖ్యంగా కొన్ని రాజకీయ నేతల అనుచరులు ఈ దందాలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టిడిఆర్ బాండ్ల వ్యవస్థను ఉపయోగించి మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించి, ధరలను భారీగా పెంచినట్లు సమాచారం. గతంలో 22% నుంచి 27% మధ్య ఉన్న టిడిఆర్…

