పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచ్ స్థానాలు గెలవాలి: మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు
రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక కసరత్తును వేగవంతం చేసింది. జిల్లాల్లో మెజారిటీ సర్పంచ్ స్థానాలను గెలుచుకుని, తర్వాత జరిగే ఎంపిటీసీ–జెడ్పీటీసీ ఎన్నికలకు బలమైన పునాది వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశంలో సీఎం అనేక కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో ఏకపక్ష నిర్ణయాలు కాకుండా స్థానిక నాయకుల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు. సర్పంచ్ ఎన్నికలు…

