జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో 23 వేల కొత్త ఓట్లు – ఫేక్ ఓటర్ ఐడీలపై పెద్ద వివాదం
2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.75 లక్షలుగా నమోదు అయింది. కానీ, 2025లో మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో వచ్చిన ఉపఎన్నికల నిమిత్తం తాజా ఓటర్ల లిస్ట్ ప్రకారం ఓట్లు 3.98 లక్షలకు పెరిగాయి. అంటే రెండు సంవత్సరాల లోపలే దాదాపు 23,000 ఓట్లు పెరిగినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అదే సమయంలో సుమారు 12,000 ఓట్లు డిలీట్ చేసినట్లు కూడా కమిషన్ తెలిపింది. అంటే మొత్తంగా…

