జడ్చర్ల సిసిఐ కేంద్రంలో హృదయ విదారక దృశ్యం – “సార్, మీ కాళ్లు మొక్కుతా… మా పత్తి కొనండి” అంటూ అధికారులు కాళ్లు పట్టుకున్న రైతు
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సిసిఐ కొనుగోలు కేంద్రంలో పత్తి రైతు అధికారి కాళ్లు మొక్కుతూ వేడుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాణ్యత, తేమ శాతం పేరుతో సిసిఐ అధికారులు పత్తి కొనేందుకు నిరాకరించడంతో తీవ్ర నిరాశకు గురైన రైతు, అధికారిని కాళ్లపై పడుతూ “సార్… మా పంట కొనండి” అని వేడుకున్న వీడియో హృదయ విదారకంగా మారింది. 🔸 “వీళ్లంతా తాగి వచ్చారు” – అధికారిణి వివాదాస్పద వ్యాఖ్య ఘటన సమయంలో రైతులు తమ…

