పీఎం కిసాన్ పథకంలో అవకతవకలు బహిర్గతం – భార్యాభర్తలకు రెండుసార్లు నిధులు, కేంద్రం 31 లక్షల కేసులు గుర్తింపు
దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన (PM Kisan Samriddhi Yojana) ప్రారంభించినా, ఇప్పుడు ఆ పథకం పక్కదారి పట్టినట్లు కేంద్ర తనికీల్లో తేలింది. కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ నిర్వహించిన తనికీల్లో 31 లక్షల అనుమానాస్పద కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో 17.87 లక్షల భార్యాభర్తలిద్దరూ ఒకే ఇంటికి చెందినవారే అయినా, ఇద్దరికీ విడిగా పీఎం కిసాన్ నిధులు జమయ్యాయని తేలింది. కుటుంబంలో భార్య గాని భర్త…

