దీపం ఉండగానే ఇల్లు సక్కదిద్దుకోవాలా? – పెళ్లిళ్లపై ప్రభుత్వ ఖర్చులపై తీవ్ర విమర్శలు”
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వ్యక్తిగత ఆరోపణలు, కుటుంబ రాజకీయాలు, ప్రభుత్వ వ్యవహారాలపై విమర్శలు తీవ్రం అవుతున్నాయి. ఇటీవల డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబంలో జరుగుతున్న వివాహ వేడుక సందర్భంగా, ప్రభుత్వ పెద్దల కుటుంబాల్లో వరుసగా జరుగుతున్న పెళ్లిళ్లు, వాటిలో ఖర్చులు, ప్రభుత్వ యంత్రాంగం వినియోగం, ప్రజా నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. భట్టి విక్రమార్క గారి కుమారుడు వివాహం నేపథ్యంలో, ఆయన భార్యపై “కలెక్షన్ క్వీన్” అంటూ వచ్చిన ఆరోపణలతో పాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు,…

