హైదరాబాద్‌లో కల్తీ ఫుడ్ మాఫియా బట్టబయలు: కుల్లిన గుడ్లతో కేకులు, యాసిడ్స్‌తో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ
హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహార పదార్థాల దందా మరోసారి బయటపడింది. పిల్లలు, పెద్దలు ప్రతిరోజూ తినే కేకులు, బిస్కెట్లు, డోనట్స్ వంటి పదార్థాలను అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేస్తున్న గ్యాంగ్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన నగర ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం, నగరంలోని పలు ప్రాంతాల్లో సమన్వయంతో దాడులు నిర్వహించగా మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో భారీగా కల్తీ ఆహార తయారీలో వాడుతున్న…

