పిల్లలకు టీ తాగిస్తున్నారా.. వెంటనే మాన్పించండి!
శీతాకాలంలో వెచ్చదనం కోసం తరచుగా టీ తాగడం సాధారణమే. అయితే ఇంట్లో పెద్దలు టీ తాగుతూ పిల్లలకూ అలవాటు చేయడం మాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎదుగుతున్న చిన్నారుల ఆరోగ్యంపై టీ తాగడం తీవ్రమైన ప్రభావం చూపుతుందని ముంబైకి చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ నిహార్ దేశాయ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ — “పన్నెండేళ్లలోపు పిల్లలు టీ తాగితే దుష్పరిణామాలు తప్పవు” అని హెచ్చరించారు. టీ లో ఉండే టానిన్స్ (Tannins)…

