జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో టిజేఎస్ మద్దతు కోరిన కాంగ్రెస్ నేత
తెలంగాణ ఉద్యమ యోధుడు, టిజేఎస్ వ్యవస్థాపకుడు కోదంరాం గారి పాత్ర తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో అశేషమైనది. తెలంగాణ కోసం ఆయన నిస్వార్థంగా, నిజాయితీగా పోరాడినవారిలో అగ్రగణ్యులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన నిరంకుశ వ్యవహారాలను వ్యతిరేకిస్తూ ఆయన టిజేఎస్ పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో, ముఖ్యంగా 2023 ఎన్నికల్లో టిజేఎస్ మరియు కమ్యూనిస్టు పార్టీల మద్దతు కీలక పాత్ర పోషించిందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని…

